పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా కుటుంబాలు ఏర్పడినా, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా పట్టించుకోలేదన్నారు.
Uttam Kumar Reddy | గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా కుటుంబాలు ఏర్పడినా, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా పట్టించుకోలేదన్నారు. లక్షలాది మంది అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా గత ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టామని చెప్పారు.
16.32 లక్షల కొత్త కార్డులు
2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా మరో 61,09,544 మందికి ఆహార భద్రత కల్పించామని చెప్పారు. పాత, కొత్త కార్డులు కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 3,42,57,109 మంది ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కల్పించే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు ఉపయోగపడే పత్రం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు పలు సంక్షేమ పథకాలను అందించే కీలక ఆధారమని చెప్పారు. ప్రతి అర్హ కుటుంబానికీ రేషన్ కార్డు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేద ప్రజలు కూడా గౌరవంగా నాణ్యమైన బియ్యం తినాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
రెండు రోజులు నియోజకవర్గాల్లో పర్యటన
కార్యక్రమంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌తోపాటు పొరుగున ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను స్వయంగా పంపిణీ చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 27న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరేడుచర్లకు చేరుకుంటారు. పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. అనంతరం పాలకీడు మండలం ముసిఒడ్డు సింగారం గ్రామంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన ముసిఒడ్డు సింగారం–రోళ్లవారిగూడెం బీటీ రోడ్డును ప్రారంభిస్తారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
హుజూర్‌నగర్ పట్టణంలో జరిగే కార్యక్రమంలో పట్టణం, మండలంతోపాటు మఠంపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. తదుపరి మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో రూ.2.80 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. కప్పలకుంట తండాలో రూ.30 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, వెల్లటూరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో రూ.10 లక్షలతో, వేపల మాధవరంలో రూ.10 లక్షలతో నిర్మించిన విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలను ప్రారంభిస్తారు.
వంతెనను ప్రారంభించనున్న మంత్రి..
మేళ్లచెరువులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువపై రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు వంతెనలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. చింతలపాలెం మండలం కొత్తగూడెం, గాంధీనగర్ తండాల్లో ఒక్కొక్కటి రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 28న గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. రెగ్యులగడ్డ తండాలో రూ.30 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, స్వయం సహాయక సంఘం భవనాలను కూడా ప్రారంభించనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?
- ●Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..

Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా

హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?




