త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taapsee | అత‌డికంటే మంచోడు దొర‌క‌లేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్‌

డెన్మార్క్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మాథిస్ బోతో పెళ్లిపై తాప్సీ మొద‌టిసారి ఓపెన్ అయ్యింది. అత‌డిని పెళ్లి చేసుకోవ‌డం జీవితంలో తాను తీసుకున్న బెస్ట్ డెసిష‌న్ అని అన్న‌ది. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ముందుగానే ఇద్ద‌రం జాగ్ర‌త్త‌ప‌డిన‌ట్లు చెప్పింది. ఆమె చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Sep 25, 2026, 6.19 pm IST

Taapsee | అత‌డికంటే మంచోడు దొర‌క‌లేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్‌
Advertisement

Taapsee | బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మాథిస్ బోతో ప్రేమాయ‌ణం, పెళ్లిపై బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణంలో అత‌డి కంటే మంచోడు త‌న‌కు క‌నిపించ‌లేద‌ని అన్న‌ది. 2013లో ఇండియ‌న్ బ్యాండ్మింట‌న్ ప్రీమియ‌ర్‌ లీగ్‌లో మాథిస్‌బోతో తాప్సీకి ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ప‌దేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ఈ జంట 2024 మార్చిలో పెళ్లిపీట‌లు ఎక్కారు. ర‌హ‌స్యంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రిగిన తాప్సీ, మాథిస్ బో పెళ్లికి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే అటెండ్ అయ్యారు. పెళ్లి ఫొటోలు, వార్త‌లు బ‌య‌ట‌కు రాకుండా ఈ జంట జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

వీడియో వైర‌ల్‌....

ఇటీవ‌లే భ‌ర్త‌తో క‌లిసి ఫారిన్‌కు వెకేష‌న్‌కు వెళ్లిన తాప్సీ వీడియో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో త‌న పెళ్లిపై మొద‌టిసారి తాప్సీ ఓపెన్ అయ్యింది. పెళ్లిని సీక్రెట్‌గా దాచాల‌ని ముందుగానే ఇద్ద‌రం నిర్ణ‌యించుకున్నామ‌ని చెప్పింది." వివాహం అన్న‌ది ఇద్ద‌రూ వ్య‌క్తులు, రెండు మ‌న‌సుల‌తో ముడిప‌డిన అంశం. జీవితాంతం ఆ మ‌ధుర క్ష‌ణాలు మా మ‌న‌సుల్లో నిలిచిపోతే చాలానుకున్నాం. అందుకే సింపుల్‌గా పెళ్లి వేడుక‌ను జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేశాం. ఆడంబ‌రాలు పోకుండా మా ప్రైవ‌సీని కాపాడుకోవాల‌నే సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్నాం. అందుకే మా పెళ్లికి సంబంధించిన ఫొటోలు లీక్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాం. నో ఫోన్ పాల‌సీని పెళ్లిలో అనుస‌రించాం. అయినా ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది చూసిన‌ప్పుడు చాలా బాధ క‌లిగింది" అని చెప్పింది.

ఉత్త‌మ నిర్ణ‌యం...

మాథిస్ బోను పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం జీవితంలో తాను తీసుకున్న అత్యుత్త‌మ నిర్ణ‌యాల్లో ఒక‌ట‌ని తాప్సీ చెప్పింది. "ఇండ‌స్ట్రీలో అప్పుడ‌ప్పుడే హీరోయిన్‌గా నిల‌దొక్కుకుంటున్నా. అలాంటి టైమ్‌లోనే మాథిస్ నా జీవితంలోకి వ‌చ్చాడు. అభ‌ద్ర‌తా భావం, తెలియ‌ని భ‌యాల‌తో అనిశ్చితంగా సాగుతోన్న నా జీవితంలో ఆనందాల‌ను నింపాడు. ప‌రిచ‌య‌మైన కొద్ది రోజుల్లోనే అత‌డిని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా. మాథిస్ బో కంటే మంచోడు నాకు భాగ‌స్వామిగా దొరుకుతాడ‌ని అనుకోలేదు. నా నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అని చాలా సార్లు రుజువైంది. మాథిస్‌ను పెళ్లి చేసుకోవ‌డం జీవితంలో నేను తీసుకున్న అత్యుత్త‌మ నిర్ణ‌యంగా ఇప్ప‌టికీ భావిస్తుంటా. ప‌ద‌మూడేళ్లు అయినా మా ప్రేమ బంధం ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా సాగ‌డానికి ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రికి ఉన్న గౌర‌వ‌మే కార‌ణం. గౌర‌వం, న‌మ్మ‌కం లేని చోట ప్రేమ నిల‌వ‌ద‌ని నేను న‌మ్ముతా" అని తాప్సీ అన్న‌ది.డెన్మార్క్‌కు చెందిన బ్యాండ్మింట‌న్ ప్లేయ‌ర్ మాథిస్ బో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు.

Advertisement
Advertisement