త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games | ఆసియా క్రీడల్లో సాత్విక్‌–చిరాగ్‌కు షాక్

Asian Games | ఆసియా క్రీడల్లో డిఫెండింగ్‌ చాంపియన్లు, ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి నిరాశపరిచారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే భారత జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 36వ ర్యాంక్‌ జోడీ పీరాచై సుఖ్‌ఫున్‌–పక్కపోన్‌ చేతిలో 21-12, 19-21, 14-21తో ఓటమిపాలైంది.

P

Sports | Published On Sep 25, 2026, 5.47 pm IST

Asian Games | ఆసియా క్రీడల్లో సాత్విక్‌–చిరాగ్‌కు షాక్
Advertisement

Asian Games | ఆసియా క్రీడల్లో డిఫెండింగ్‌ చాంపియన్లు, ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి నిరాశపరిచారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే భారత జోడీకి అనూహ్య పరాజయం ఎదురైంది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ 36వ ర్యాంక్‌ జోడీ పీరాచై సుఖ్‌ఫున్‌–పక్కపోన్‌ చేతిలో 21-12, 19-21, 14-21తో ఓటమిపాలైంది. దీంతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలన్న భారత జోడీ ఆశలు తొలి మ్యాచ్‌తోనే ముగిశాయి. తొలి గేమ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. థాయ్‌ జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-12తో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో సుఖ్‌ఫున్‌–తీరత్సకుల్‌ పుంజుకున్నారు. 17-13తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లిన థాయ్‌ జోడీపై సాత్విక్‌–చిరాగ్‌ తిరిగి పోరాటం చేశారు. వరుస పాయింట్లతో 18-19కు చేరుకున్నారు.

కానీ చివర్లో థాయ్‌ జోడీ పైచేయి సాధించి 21-19తో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ థాయ్‌ జోడీ అదే జోరును కొనసాగించింది. సాత్విక్‌–చిరాగ్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనా.. సుఖ్‌ఫున్‌–తీరత్సకుల్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. చైనా మాస్టర్స్‌ విజేతలుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన సాత్విక్‌–చిరాగ్‌కు ఈ ఫలితం ఊహించని ఎదురుదెబ్బ త‌గిలింది. గత నెలలో జరిగిన చైనా మాస్టర్స్‌ ఫైనల్లో హీ జిటింగ్‌–రెన్‌ జియాంగ్యూ జోడీని 11-21, 21-13, 21-17తో ఓడించి టైటిల్‌ సాధించారు. అంతకుముందు పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ కాంస్య పతకం సాధించడంలోనూ సాత్విక్‌–చిరాగ్‌ కీలక పాత్ర పోషించారు.

క్వార్టర్స్‌లో తనిషా–ధ్రువ్‌

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనిషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో మాల్దీవులకు చెందిన నిబాల్‌ అహ్మద్‌–అమినత్‌ నబీహా అబ్దుల్‌ రజాక్‌ను 21-8, 21-7తో ఓడించింది. అనంతరం మలేసియా జోడీ షెవోన్‌ జెన్నీ లాయ్‌–సూన్‌ హువాట్‌ గోహ్‌పై గంటపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 22-20, 24-22తో విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనాకు చెందిన యాన్‌ జె ఫెంగ్‌–డాంగ్‌పింగ్‌ హువాంగ్‌తో తనిషా–ధ్రువ్‌ తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లోనూ భారత్‌కు శుభారంభం లభించింది. ఉన‍్నతి హుడా రెండో రౌండ్‌కు చేరింది. ఉత్తర కొరియాకు చెందిన మి సాంగ్‌ యును 21-9, 21-10తో కేవలం 30 నిమిషాల్లో ఓడించింది.

Advertisement
Advertisement