Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
Sircilla | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు సిరిసిల్లలోని రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Sircilla | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు సిరిసిల్లలోని రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
- ●Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా
- ●పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Six dies in Road Accident | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సంగీత కళాకారుల దుర్మరణం
- ●Ward Officers | ఘన వ్యర్థాల నిర్వహణపై వార్డు అధికారులకు శిక్షణ

Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది

Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా

పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్





