త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | అమెరికాతో ట్రేడ్ డీల్ ఖ‌రారు.. ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

PM Modi | భారత్, అమెరికా మధ్య వాణిజ్య (India-US Trade Deal) సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాల మ‌ధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖ‌రారైన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇది ఇరు దేశాలకు పెద్ద గుడ్‌న్యూస్ అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు ట్రంప్‌ (US President Donald Trump)కు ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

D

National | Published On Feb 7, 2026, 11.08 am IST

PM Modi | అమెరికాతో ట్రేడ్ డీల్ ఖ‌రారు.. ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | భార‌త్ - అమెరికా మ‌ధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) ఖ‌రారైన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసి.. సంయుక్త ప్ర‌క‌ట‌న చేశాయి. ఈ ప్ర‌క‌ట‌న‌పై భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేర‌కు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది ఇరు దేశాలకు పెద్ద గుడ్‌న్యూస్ అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు ట్రంప్‌ (US President Donald Trump)కు ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

"భార‌త్‌, అమెరికాకు ఇది శుభ‌వార్త‌. రెండు గొప్ప దేశాల మ‌ధ్య మ‌ధ్యంత‌ర వాణిజ్య ఒప్పందం కోసం ఓ ఫ్రేమ్‌వ‌ర్క్‌ను ఖ‌రారు చేశాం. మ‌న దేశాల మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాల కోసం వ్య‌క్తిగ‌త నిబ‌ద్ధ‌త‌తో కృషి చేసిన అధ్య‌క్షుడు ట్రంప్‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను" అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. అంతేకాదు, ఈ ఫ్రేమ్‌వ‌ర్క్ ఇరు దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యం, పెరుగుతున్న న‌మ్మ‌కం, చైత‌న్యాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. భార‌త్‌లోని రైతులు, వ్య‌వ‌స్థాప‌కులు, ఎంఎస్ఎంఈలు, స్టార్ట‌ప్ ఆవిష్క‌ర్త‌లు, మ‌త్స్య‌కారుల‌కు కొత్త అవ‌కాశాలను సృష్టిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు ఇది 'మేక్ ఇన్ ఇండియా'ను బలోపేతం చేస్తుంద‌న్నారు. మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

వాణిజ్య ఒప్పందం ఖ‌రారు..

భారత్, అమెరికా మధ్య వాణిజ్య (India-US Trade Deal) సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాలు కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖ‌రారైంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్ర‌కారం.. భార‌తీయ వ‌స్తువుల‌పై 50 శాతం ఉన్న సుంకాన్ని (tariffs) 18 శాతానికి త‌గ్గించిన‌ట్లు అమెరికా ప్ర‌క‌టించింది.

అద‌న‌పు సుంకాలు తొల‌గింపు..

అంతేకాదు, తాజా ఒప్పందం నేప‌థ్యంలో ర‌ష్యా చ‌మురు కొనుగోలు (Russian Oil Imports) కార‌ణం చూపి భార‌త వ‌స్తువుల‌పై విధించిన 25 శాతం సుంకాన్ని కూడా యూఎస్ తొల‌గించింది (Trump Lifts 25Percent Tariff On India). అదేవిధంగా ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను నిలిపివేసేందుకు భార‌త్ అంగీక‌రించిన‌ట్లు అమెరికా తెలిపింది. త‌మ దేశం నుంచి భారీగా ఇంధ‌నం, గ్యాస్‌ను దిగుమ‌తి చేసుకునేందుకు ఇండియా ఓకే చెప్పిన‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement
Advertisement