త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stampede | దుర్గామాత మండ‌పం వద్ద తొక్కిస‌లాట‌.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు

Stampede | ప‌శ్చిమ‌బెంగాల్‌లోని కోల్‌క‌తాలో (Kolkata) విభిన్న ఇతివృత్తంతో కొలువుదీరిన దుర్గామాత ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్త‌డంతో తొక్కిస‌లాట (Stampede)చోటుచేసుకుంది. దీంతో 19 మంది మ‌ర‌ణించ‌గా, సుమారు 35 మంది గాయ‌ప‌డ్డారు.

G

National | Published On Oct 18, 2026, 6.24 am IST

Stampede | దుర్గామాత మండ‌పం వద్ద తొక్కిస‌లాట‌.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు
Advertisement

Stampede | త్రినేత్ర న్యూస్‌: ప‌శ్చిమ‌బెంగాల్‌లోని కోల్‌క‌తాలో (Kolkata) విభిన్న ఇతివృత్తంతో కొలువుదీరిన దుర్గామాత ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్త‌డంతో తొక్కిస‌లాట (Stampede)చోటుచేసుకుంది. దీంతో 19 మంది మ‌ర‌ణించ‌గా, సుమారు 35 మంది గాయ‌ప‌డ్డారు. ఉత్త‌ర కోల్‌క‌తాలోని చోర్‌బ‌గ‌న్ (Chor Bagan) ప్రాంతంలో గ‌త 91 ఏండ్లుగా ప్ర‌తి ఏటా దుర్గామాత విగ్ర‌హం ప్ర‌తిష్ఠించి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జ‌రుపురుతున్నారు. ఈ ఏడాది దుర్గామాత మండ‌పాన్ని (Sarbojanin Durga Puja pandal) మౌన‌ముద్ర‌లో శాంత‌మూర్తిగా కూర్చున్న అమ్మ‌వారు, చుట్టూ వినాయ‌కులు, దేవ‌త‌లు జ‌పం చేస్తున్న‌ట్లుగా విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. దీంతో శ‌నివారం సాయంత్రం మండ‌పాన్ని చూసేందుకు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

ఈ క్ర‌మంలో ఒక్కసారిగా వర్షం మొదలుకావటంతో భక్తులందరూ మండపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో క్యూలైన్ల‌లో జ‌నం కిక్కిరిసిపోయారు. అదేస‌మ‌యంలో మండ‌పంలోని ఒక భాగం కూలిపోయింద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. ఎగ్జిట్ గేట్ నుంచి జ‌నం ప‌రుగులు తీశారు. తోపులాటలో కింద‌ప‌డిన వారిని తొక్కుకుంటూ జ‌నం ప‌రుగులు పెట్టారు. దీంతో జ‌నం పాదాల కింద న‌లిగి 19 మంది ఊపిరాడ‌క చ‌నిపోయారు. ప‌లువురు స్పృహ‌త‌ప్పి ప‌డిపోవ‌డంతో.. వారిని కోల్‌కతా మెడికల్ కాలేజీ (MCH) ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త‌వ‌హిస్తూ చోర్‌బ‌గ‌న్ దుర్గా పూజా క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యంత బెన‌ర్జీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

విష‌యం తెలుసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి శారద్వత్ ముఖర్జీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై మాజీ సీఎం మమతాబెనర్జీ, ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్ర‌ధాని మోదీ ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement
Advertisement