త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medical PG Seats | మెడిక‌ల్ కాలేజీల్లో పెరిగిన‌ పీజీ సీట్లు..

Medical PG Seats | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల్లో పీజీ సీట్ల (Medical PG Seats) సంఖ్య భారీగా పెరిగింది. జాతీయ వైద్య క‌మిష‌న్ (NMC) కొత్త‌గా 769 సీట్లు మంజూరు చేసింది.

G

Telangana | Published On Nov 7, 2026, 7.55 am IST

Medical PG Seats | మెడిక‌ల్ కాలేజీల్లో పెరిగిన‌ పీజీ సీట్లు..
Advertisement

Medical PG Seats | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల్లో పీజీ సీట్ల (Medical PG Seats) సంఖ్య భారీగా పెరిగింది. జాతీయ వైద్య క‌మిష‌న్ (NMC) కొత్త‌గా 769 సీట్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో పీజీ సంఖ్య 4185కి చేరింది. ఇందులో ప్ర‌భుత్వ మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1766కి పెరిగింది. ఇక ప్రైటే కాలేజీల్లో సీట్ల సంఖ్య‌ 2419కి చేరింది.

కాగా, ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో 400 పీజీ సీట్లను పెంచాలని వైద్యవిద్య సంచాలక (DME) విభాగం ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే 300 సీట్లు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఇక ప్రైవేటు కాలేజీల్లో కొత్త‌గా 469 సీట్లు అందుబాటులో వ‌చ్చాయి. ఇప్పటికే పీజీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ అర్హుల మెరిట్‌ జాబితాను కూడా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో భూపాలపల్లి, జగిత్యాల తదితర కాలేజీల్లో ఈసారి పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement