CM Suvendu Adhikari | సనాతన ధర్మాన్ని పాటించే వారే అమ్మవారి విగ్రహాలను తాకాలి.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
CM Suvendu Adhikari | నదిలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం చేసే సమయంలో సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) పాటించే వారే అమ్మవారి ప్రతిమలను (Durga idols) తాకేందుకు అనుమతించాలని బెంగాల్ సీఎం సువేందు అధికారి (CM Suvendu Adhikari) అధికారులకు స్పష్టం చేశారు.
CM Suvendu Adhikari | త్రినేత్ర న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి సువేందుకు అధికారి (CM Suvendu Adhikari) సంచలన వ్యాఖ్యలు చేశారు. హుగ్లీ నదిలో (Hooghly river) దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం (Durga idols immersion) చేసే సమయంలో సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) పాటించే వారే అమ్మవారి ప్రతిమలను తాకేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు. కోల్‌కతాలోని బాబూఘాట్ వద్ద దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను సీఎం బుధవారం పరిశీలించారు. ఈ ఏడాది నిమజ్జన వేడుకల్లో భద్రతను మరింత కఠినతరం చేసినట్లు చెప్పారు. క్రేన్‌లకు బదులుగా ట్రాలీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విగ్రహాలను నదిలోకి మోసుకెళ్లే వారిని గుర్తించి, వారి వివరాలను సేకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు మాత్రమే అమ్మవారి ప్రతిమలను తాకుతారని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి మతపరమైన వివక్ష లేదని స్పష్టం చేశారు. వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, గ్రంథాలు, ఆచారాల ప్రకారం నిమజ్జన పవిత్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. "నిమజ్జన పవిత్రతను కాపాడటానికి, వేల సంవత్సరాలుగా పాటిస్తున్న సంప్రదాయాలు, శాస్త్రాలు, నిబంధనలను మనం కచ్చితంగా పాటించాలి. ఇది పండుగ మాత్రమే కాదు.. ప్రాథమికంగా ఇదొక మతపరమైన కార్యక్రమం" అని సీఎం వెల్లడించారు.
Also Read..
వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!
2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stampede | దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి, 35 మందికి గాయాలు
అక్టోబర్ 18, 2026

West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!
అక్టోబర్ 17, 2026

Double Engine Disaster | “డబుల్ డిజాస్టర్”.. 5 నెలల్లో 2,454 అత్యాచారాలు, 600 హత్యలు
అక్టోబర్ 7, 2026
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
- ●Hyderabad Police | నాలుగు పాలపిట్టలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు
- ●US Visa | వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!
- ●Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..
- ●K-Harmony Festa | హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 25న ‘కె-హార్మనీ ఫెస్టా’
- ●Suicide | కుషాయిగూడలో విషాదం.. హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ

Hyderabad Police | నాలుగు పాలపిట్టలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

US Visa | వలసలపై ట్రంప్ సర్కార్ కొరడా.. ఏడాదిలోనే మూడు లక్షల వీసాలు రద్దు..!

Jio IPO | జియో ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన.. 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్..



