Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
Pallavotsavam | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెల 22న పల్లవోత్సవాన్ని నిర్వహించనుంది. దాదాపు 300 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Devotional | Published On Jul 19, 2026, 6.28 pm IST
Pallavotsavam | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెల 22న పల్లవోత్సవాన్ని నిర్వహించనుంది. దాదాపు 300 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవంలో భాగంగా సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్నాటక సత్రానికి చేరుకుంటారు. అక్కడ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.
300 ఏళ్ల చారిత్రక సంప్రదాయం
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం తిరుమలలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. తొలినాళ్లలో ఈ ఉత్సవాన్ని ‘తోటోత్సవం’గా పిలిచేవారు. కర్నాటక సత్రాలకు విచ్చేసిన మలయప్పస్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం ఈ ఉత్సవంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు తిరుమల ఆలయానికి విశేష సేవలు అందించారు. భక్తి భావంతో అనేక విరాళాలు సమర్పించడమే కాకుండా, బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను అందించారు. శ్రీవారి వాహన సేవల్లో భాగంగా ఐదో రోజు ఉదయం నిర్వహించే పల్లకీ ఉత్సవం కోసం ఏనుగు దంతాలతో ప్రత్యేక కళాకృతులతో రూపొందించిన పల్లకీని కూడా మైసూరు మహారాజే అందించారు.
నేటికీ కొనసాగుతున్న సంప్రదాయాలు
శ్రీవారి సుప్రభాత సేవకు ముందు మైసూరు సంస్థానం తరఫున నవనీత హారతి సమర్పించే సంప్రదాయాన్ని మహారాజు ప్రారంభించారు. అలాగే, ఆలయంలోని అఖండ దీపాలైన బ్రహ్మదీపం, మహారాజ దీపాలకు ప్రతిరోజూ ఐదు కిలోల నెయ్యి అందించే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాల్లోనూ మైసూరు మహారాజు పేరుతో ప్రత్యేక హారతి సమర్పిస్తారు. అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం రోజున కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




