త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger attacked | బీడీ ఆకులు ఏరుకునే మ‌హిళ‌ల‌పై పులి పంజా.. న‌లుగురు మృతి

Tiger attacked | మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో ఘోరం జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి పంజా విసిరింది. న‌లుగురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

S

National | Published On May 22, 2026, 12.42 pm IST

Tiger attacked | బీడీ ఆకులు ఏరుకునే మ‌హిళ‌ల‌పై పులి పంజా.. న‌లుగురు మృతి
Advertisement

Tiger attacked | త్రినేత్ర‌.న్యూస్‌: మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో ఘోరం జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి పంజా విసిరింది. ఈ దాడిలో న‌లుగురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన మ‌హిళ‌ల‌ను కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్‌ చౌదరీ, సునీతా కౌశిక్‌ మొహర్లేగా గుర్తించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి అంజలీ సాయంకర్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

అంతా 45 ఏళ్ల లోపు వారే..

గంజేవాహి అటవీ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం కూడా కొందరు మహిళలు వెళ్లారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ పులి మాటువేసి వారిపై పంజా విసిరిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడిన‌ట్లు చెప్పారు. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారేన‌ని స్థానికులు పేర్కొన్నారు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement
Advertisement