Heat Waves Alert | మూడు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Heat Waves Alert | తెలంగాణలో రాగల వారం రోజులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగత్రల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Heat Waves Alert | తెలంగాణలో రాగల వారం రోజులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగత్రల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాద్‌లో రాత్రిపూట వేడి..
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే, భద్రాచలం, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో రాత్రి సైతం వేడి పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది.
పలుచోట్ల వర్షం కురిసే ఛాన్స్..
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే, ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలో గరిష్ట ఉష్ణోగత్రలు
ఇదిలా ఉండగా.. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వివరించింది. కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..
- ●MP Chamala Kirankumar Reddy | భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: జీఎంకు ఎంపీ చామల వినతి
- ●Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్
- ●Jagadeesh Reddy | డల్లాస్ వేడుకల స్ఫూర్తిగా మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: జగదీశ్‌రెడ్డి
- ●Amit Shah | దేశ సరిహద్దులు ఇక స్మార్ట్‌గా..!

Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..

MP Chamala Kirankumar Reddy | భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: జీఎంకు ఎంపీ చామల వినతి

Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్

Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్




