త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్‌ ట్రాక్‌లో పడినట్లేనా..?

Pooja Hegde | టాలీవుడ్‌లో గతంలో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం మళ్లీ సౌత్‌లో బిజీ షెడ్యూల్‌తో వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ బుట్టబొమ్మ. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకేసారి ప్రాజెక్టులు చేస్తూ మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది.

P

Entertainment | Published On May 22, 2026, 2.35 pm IST

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్‌ ట్రాక్‌లో పడినట్లేనా..?
Advertisement

Pooja Hegde | టాలీవుడ్‌లో గతంలో వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం మళ్లీ సౌత్‌లో బిజీ షెడ్యూల్‌తో వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ బుట్టబొమ్మ. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒకేసారి ప్రాజెక్టులు చేస్తూ మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’.  హిందీలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ముఖ్యంగా పూజా హెగ్డే వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, మీడియా మీట్స్‌లో పాల్గొంటూ సినిమాకు హైప్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.

ఇదిలా ఉంటే.. చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తమిళ చిత్రం ‘జననాయగన్’ సైతం విడుదలకు సిద్ధమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సి. జోసెఫ్ విజయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నిర్మాత వెంకట నారాయణతో సమావేశమై సినిమా విడుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఇప్పుడు సినిమా ప్రచార బాధ్యతల్లో ఎక్కువ భాగం పూజా హెగ్డేపైనే పడనుందని తెలుస్తోంది. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో కూడా ఆమె కీలకంగా మారబోతోంది. ఇక తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ‘డీక్యూ41’లో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. పూజా కూడా తన పార్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తోందట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే, తమిళంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘కాంచన 4’లో కూడా పూజా కీలక పాత్ర పోషిస్తోంది. దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని 2027లో విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. పూజే హెగ్డే కెరీర్‌ను పరిశీలిస్తే.. ముకుంద సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అరవిందే సమేత, అలా వైకుంఠపురం, హర్షి తదితర సినిమాలు చేసి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టాప్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. గత రెండేళ్లుగా ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాపోవడంతో జోరు తగ్గింది. అయినా గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ పరంగా పూజాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు వరుసగా నాలుగు భాషల్లో సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో ఆమె మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement