త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రామ్ చ‌ర‌ణ్‌, శృతి హాస‌న్ – పెద్ది స్పెష‌ల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రామ్‌చ‌ర‌ణ్‌, శృతి హాస‌న్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ఫుల్ సాంగ్‌ను శ‌నివారం భోపాల్‌లో జ‌రిగే ఈవెంట్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On May 22, 2026, 2.00 pm IST

Peddi | స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన  రామ్ చ‌ర‌ణ్‌, శృతి హాస‌న్ – పెద్ది స్పెష‌ల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Peddi |  రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా బ‌జ్ నెల‌కొంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

స్పెష‌ల్ సాంగ్‌...

పెద్దిలో హీరోయిన్ శృతి హాస‌న్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది. ఏప్రిల్ నెలాఖ‌రున హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా రామ్‌చ‌ర‌ణ్, శృతి హాస‌న్‌ల‌పై ఈ పాట‌ను షూట్ చేశారు. హ‌ల్లల్లలో హ‌ల్లో హ‌ల్లో అంటూ సాగిన ఈ ఐటెంసాంగ్ ప్రోమోను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శృతి హాస‌న్‌, రామ్‌చ‌ర‌ణ్ త‌మ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. ఈ సాంగ్ ప్రోమోలో శృతి హాస‌న్‌తో జాన్వీ క‌పూర్ కూడా క‌నిపించింది. తెలుగులో ఈ పాట‌కు ఆనంత శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా ర‌క్షిత సురేష్ ఆల‌పించింది. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు. ఈ ఐటెం సాంగ్‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు.

భోపాల్ ఈవెంట్‌లో...

పెద్ది కా ఆవాజ్ పేరుతో మే 23న శ‌నివారం భోపాల్‌లో ఓ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.ఈ ఈవెంట్‌లోనే హ‌ల్ల‌ల్ల‌లో ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్రోమోతో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, శృతి హాస‌న్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వంద మిలియ‌న్ల‌తో...

కాగా రామ్‌చ‌ర‌ణ్ పెద్ది ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఇర‌వై నాలుగు గంట‌ల్లోనే ఈ ట్రైల‌ర్ వంద మిలియ‌న్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో క్రికెట‌ర్‌, రెజ్ల‌ర్‌, ర‌న్న‌ర్‌గా...క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్ పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ లుక్‌, అత‌డి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. పెద్ది సినిమాలో శివ‌రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement