PPF | రూ.1 కోటి పీపీఎఫ్ కార్పస్‌తో నెలకు రూ.60 వేల ఆదాయం.. ఏం చేయాలంటే..?
PPF | ఈక్విటీ మార్కెట్లలో గత కొన్నేళ్లుగా బలహీన ప్రదర్శనతో ఇబ్బందిపడుతున్నారా? మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో చాలా కాలంగా స్థిరంగానే ఉందా? అయితే ఆందోళన అవసరం లేదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు అందించే ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలపై దృష్టి పెట్టొచ్చు.
PPF | ఈక్విటీ మార్కెట్లలో గత కొన్నేళ్లుగా బలహీన ప్రదర్శనతో ఇబ్బందిపడుతున్నారా? మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో చాలా కాలంగా స్థిరంగానే ఉందా? అయితే ఆందోళన అవసరం లేదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు అందించే ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలపై దృష్టి పెట్టొచ్చు. ఇటీవలి కాలంలో నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలు నెగెటివ్ రిటర్న్స్ ఇవ్వడంతో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పీపీఎఫ్ భారత ప్రభుత్వ మద్దతుతో నడిచే అత్యంత విశ్వసనీయ దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలలో ఒకటి. ఇది గ్యారంటీడ్ రిటర్న్స్ అందించే స్కీమ్‌గా పేరుగాంచింది. క్రమశిక్షణతో పెట్టుబడి పెడుతూ, దీర్ఘకాల కాంపౌండింగ్ ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటే, రిటైర్మెంట్ సమయానికి రూ.1 కోటికి పైగా కార్పస్ నిర్మించుకోవచ్చు. అంతేకాదు, ఆ మొత్తంపై వచ్చే వడ్డీ ద్వారానే నెలకు రూ.60 వేలకుపైగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
కాంపౌండింగ్ ప్రభావంతో గణనీయంగా వృద్ధి..
ప్రస్తుతం పీపీఎఫ్‌పై సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాకు 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అనంతరం ఐదేళ్ల బ్లాకులుగా పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంది. దీర్ఘకాలంలో ఇది భారీ కార్పస్ సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏడాదికి రూ.1.50 లక్షలను పీపీఎఫ్ లో పెట్టుబడిగా పెడితే 15 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ముగిసే సరికి ఏడాదికి 7.1 శాతం వార్షిక వడ్డీతో మొత్తం రూ.40.68 లక్షలు అవుతాయి. తరువాత ఇంకో 5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్ల తరువాత ఆ మొత్తం రూ.66.58 లక్షలు అవుతుంది. ఇంకో 5 ఏళ్లు పొడిగించాక, 25 ఏళ్ల అనంతరం ఆ మొత్తం రూ.1.03 కోట్లు అవుతుంది. ఇలా పీపీఎఫ్‌లో రూ.1 కోటి కార్పస్ నిర్మించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రూ.1 కోటికి పైగా కార్పస్ లక్ష్యంగా పెట్టుకుంటే, 25 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది రూ.1.50 లక్షలను నిరంతరం పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా చివరి సంవత్సరాల్లో కాంపౌండింగ్ ప్రభావం గణనీయంగా పెరిగి, సంపద సృష్టిని వేగవంతం చేస్తుంది.
ఆదాయం ఇలా..
రూ.1.03 కోట్ల కార్పస్ సృష్టించిన తర్వాత, పెట్టుబడిదారు కొత్తగా డబ్బు జమ చేయకుండా వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఆదాయాన్ని నెల నెలా పొందవచ్చు. మొత్తం రూ.1.03 కోట్లు జమ అయ్యాక పీపీఎఫ్ వార్షిక రేటు ఏడాదికి 7.1 శాతం అనుకుంటే, ఆ మొత్తానికి వార్షికంగా రూ.7.32 లక్షల ఆదాయం వస్తుంది. దీన్ని ఒక నెలకు విభజిస్తే రూ.60,989 అవుతుంది. అంటే మొత్తం రూ.1 కోటి కార్పస్ నిర్మాణం అయ్యాక తరువాత పొదుపు చేయాల్సిన పని ఉండదు. ఆ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీతోనే గడిపేయవచ్చు. పైగా కార్పస్ మొత్తం అలాగే ఉంటుంది. ఇలా పీపీఎఫ్ పథకం అద్భుతమైన రాబడిని అందిస్తుంది. అంటే అసలు పెట్టుబడిని అలాగే ఉంచి, కేవలం వడ్డీ ద్వారానే నెలకు దాదాపు రూ.60 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే పీపీఎఫ్‌లో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే విత్‌డ్రాయల్‌కు అనుమతి ఉంటుంది. అందువల్ల వడ్డీ ఉపసంహరణలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అయితే ఈ లెక్కలు కొన్ని అంచనాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తం పెట్టుబడి కాలం పాటు వడ్డీ రేటు మారకుండా ఉండటం, ప్రతి ఏడాది గరిష్ఠ పరిమితి మేర పెట్టుబడి కొనసాగించడం వంటి అంశాలను ఇందులో పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, దీర్ఘకాలిక లక్ష్యాలు, ద్రవ్యోల్బణ ప్రభావం వంటి అంశాలను పరిశీలించి, నిపుణుల సలహాతోనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Daughter Future | కుమార్తె భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే.. తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఇవే..
మే 16, 2026

Retirement Schemes | ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎస్.. వీటిలో ఏది రిటైర్మెంట్ వయస్సులో ఉత్తమ రాబడిని ఇస్తుంది..?
మే 16, 2026

Retirement Fund | 20 ఏళ్లలో రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్‌ను జమ చేయలేమా..? సాధ్యమేనా..?
మే 9, 2026
తాజావార్తలు
- ●Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..
- ●MP Chamala Kirankumar Reddy | భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: జీఎంకు ఎంపీ చామల వినతి
- ●Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్
- ●Jagadeesh Reddy | డల్లాస్ వేడుకల స్ఫూర్తిగా మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: జగదీశ్‌రెడ్డి
- ●Amit Shah | దేశ సరిహద్దులు ఇక స్మార్ట్‌గా..!

Asset Allocation | తక్కువ రిస్క్‌తో భారీ రాబడులు.. సరైన అసెట్ అలొకేషన్‌తో సంపద సృష్టి..

MP Chamala Kirankumar Reddy | భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: జీఎంకు ఎంపీ చామల వినతి

Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్

Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్



