త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samajwadi Party | అఖిలేశ్‌కు షాక్‌.. నేడు బీజేపీలో చేర‌నున్న‌ ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు

Samajwadi Party | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, Samajwadi Party (SP) అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌కు (Akhilesh Yadav) ముగ్గురు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోనున్నారు.

G

National | Published On Oct 14, 2026, 9.20 am IST

Samajwadi Party | అఖిలేశ్‌కు షాక్‌.. నేడు బీజేపీలో చేర‌నున్న‌ ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు
Advertisement

Samajwadi Party | త్రినేత్ర న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, Samajwadi Party (SP) అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌కు (Akhilesh Yadav) ముగ్గురు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం (అక్టోబర్‌ 14) అమేథీలో జరుగ‌నున్న‌ కార్యక్రమంలో ఎస్పీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (Rebel MLAs) రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌, వినోద్‌ చతుర్వేది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్‌ చౌధరి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తిరుగుబాటు చేయ‌డం, అధికార బీజేపీలో చేర‌నుండ‌టంతో ఎస్పీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది.

గౌరీగంజ్‌ నుంచి రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్ (Rakesh Pratap Singh), అయోధ్యలోని గోసాయిగంజ్‌ నుంచి అభయ్‌ సింగ్ (Abhay Singh), జాలౌన్‌ జిల్లాలోని కాల్పి నుంచి వినోద్‌ చతుర్వేది (Vinod Chaturvedi) ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ 2012, 2017, 2022 ఎన్నికల్లో వరుసగా గెలుపొందగా, అభయ్‌ సింగ్‌ 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022లో మరోసారి విజయం సాధించారు. ఇక వినోద్‌ చతుర్వేది 2007లో, తిరిగి 2022లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు 2024లో జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల (Rajya Sabha Elections) స‌మ‌యంలో పార్టీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలు ఉన్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో 2025 జూన్‌లో రాకేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌పై ఎస్పీ బహిష్కరణ వేటు వేసింది. మ‌రో ఎమ్మెల్యే వినోద్‌ చతుర్వేది కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌నుండ‌టం గ‌మ‌నార్హం.

 

Advertisement
Advertisement