Aircraft Crash | బరామతిలో కూలిన ట్రైయినీ విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్
Aircraft Crash | మహారాష్ట్రలోని పుణె జిల్లా బరామతి ఎయిర్‌స్ట్రిప్ వద్ద ఆదివారం శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ సంస్థకు చెందిన విమానం రన్‌వేపై అదుపు తప్పి బయటకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
Aircraft Crash | మహారాష్ట్రలోని పుణె జిల్లా బరామతి ఎయిర్‌స్ట్రిప్ వద్ద ఆదివారం శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ సంస్థకు చెందిన విమానం రన్‌వేపై అదుపు తప్పి బయటకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పుణె జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వీటీ-ఎస్ఈఎక్స్ (VT-SEX) విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ డోయ్‌ఫోడే, క్యాడెట్ అభిజీత్ జుండ్రే ఉన్నారు. శిక్షణలో భాగంగా సర్కిలింగ్, అత్యవసర ల్యాండింగ్ సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో రన్‌వే-29పై విమానం ల్యాండ్ అయిన తర్వాత పూర్తిగా ఆగకుండా.. రన్‌వే చివరను దాటి పేవ్‌మెంట్ వెలుపలికి వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
ఏడు నెలల్లో రెండో ఘటన
బరామతి ప్రాంతంలో విమాన ప్రమాదం జరగడం ఇది ఇటీవలి కాలంలో రెండోసారి. సుమారు ఏడు నెలల కిందట ఇదే ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 28న లియర్‌జెట్-45 విమానం రెండోసారి ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఆ విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, సహాయకుడు, పైలట్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ ఉన్నారు. ఈ ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) విచారణ కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జనవరికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉన్నది.
మేలోనూ ప్రమాదం..
బరామతిలో శిక్షణ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. గత మే 13న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన మరో శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. గోజుబావి గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ట్రయినీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ల్యాండింగ్‌కు ముందు విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అనంతరం నేలను తాకినట్లు అధికారులు వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!
- ●Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు
- ●Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- ●Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం

iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..

వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య






