Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఓ యువ రైతు టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
Drumstick | దానిమ్మ పండ్ల( Pomegranate )కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.. ఈ తోటల సాగు కూడా అధికమే. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే దానిమ్మ సాగు( Pomegranate Cultivation ) చేసిన ఓ రైతు కుటుంబం తీవ్రంగా నష్టాలు చవిచూసింది. దీంతో ప్రత్యామ్నయంగా మార్కెట్‌లో 365 రోజులు డిమాండ్ ఉండే మునగ సాగు( Drumstick Cultivation )ను ప్రారంభించాడు యువ రైతు సాగర్ యెల్పలే( Sagar Yelpale ). ఎకరా నుంచి 18 ఎకరాలకు మునగసాగును విస్తరించి.. ప్రస్తుతం ఏడాదికి రూ. 1.15 కోట్ల టర్నోవర్‌కు ఎదిగాడు. మరి సాగర్ గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra )లోని షోలాపూర్( Solapur ) జిల్లాకు వెళ్లాల్సిందే.
Agriculture | Published On Aug 7, 2026, 1.45 pm IST
Drumstick | మహారాష్ట్ర( Maharashtra )లోని షోలాపూర్( Solapur ) జిల్లాకు చెందిన సాగర్ యెల్పలే( Sagar Yelpale ) అనే యువకుడు తన తండ్రితో కలిసి 2012 నుంచి వ్యవసాయం( Agriculture ) చేస్తున్నాడు. పది ఎకరాల వ్యవసాయ పొలంలో వివిధ రకాల పండ్లను పండించేవారు. అధిక మొత్తంలో దానిమ్మ సాగు( Pomegranate Cultivation ) చేసేవారు. కానీ పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. దానిమ్మ సాగులో నష్టాలు చవిచూసేవారు. ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం వచ్చేది. ఇందులో 1.5 లక్షలు పెట్టుబడికి పోయేవి. ఈ ఆదాయానికి కూడా ఆరు నెలల పాటు ఆగాల్సి వచ్చేది. ఈ క్రమంలో దానిమ్మ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని గ్రహించిన సాగర్.. మరో పంటపై దృష్టి సారించాడు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఉండే పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.
స్నేహితుడి సలహాతో..
2017లో సాగర్ స్నేహితుడు మునగ సాగు( Drumstick Cultivation ) గురించి చెప్పాడు. తక్కువ పెట్టుబడితోనే మునగ సాగు చేయొచ్చని తెలుసుకున్నాడు. అది కూడా త్వరగా దిగుబడి వస్తుంది.. మార్కెట్‌లో కూడా నిరంతరం దానికి డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. మొదట ఎకరా పొలంలో మునగ సాగు ప్రారంభించాడు. 400 గ్రాముల మునగ విత్తనాలను రూ. 4 వేలకు కొనుగోలు చేశారు. ఆవు పేడతో నేలను సారవంతం చేశాడు.. 2017 జనవరి నెలలో మునగ విత్తనాలను నాటాడు.
ఐదు నెలల్లోనే దిగుబడి.. తొలి పంటకు రూ. 3 లక్షల ఆదాయం
ఈ విత్తనాలు ఐదు నెలల్లోనే పెరిగి పెద్దగా అయ్యాయి. 2017 జూన్ నాటికి మునగ పంట చేతికి వచ్చింది. ఎకరా పొలంలో ఐదు నెలల వ్యవధిలోనే 10 టన్నుల వరకు దిగుబడి సాధించాడు సాగర్. ఇక కేజీ మునగకాయలను రూ. 20 నుంచి రూ. 30 వరకు విక్రయించాడు. దాదాపు రూ. 3 లక్షల వరకు ఆదాయం ఆర్జించాడు సాగర్.

ఎకరా నుంచి 18 ఎకరాలకు విస్తరణ
ఐదు నెలల వ్యవధిలోనే దిగుబడి రావడం, ఆదాయం కూడా మంచిగా ఉండడంతో.. 18 ఎకరాలకు విస్తరించాడు మునగ సాగు. సొంతంగా 10 ఎకరాలు ఉండగా, మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 2018లో 18 ఎకరాల్లో 12 వేల మొక్కలు నాటాడు. ఈసారి రెండు వెరైటీలను సాగు చేశాడు సాగర్. ఇందులో ఒకటి ఓడీసీ-3 కాగా, మరొకటి ఓడీసీ-4. ఈ రెండు రకాలకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి వీటినే ఎంచుకున్నాడు.
ఏడాదికి సగటున 200 టన్నుల దిగుబడి
ఒక్కో మొక్క 10 నుంచి 12 కేజీల వరకు దిగుబడి ఇచ్చింది. ఏడాదికి రెండుసార్లు దిగుబడి రాగా, ఒక్కో పంటలో ఒక్కో మొక్క నుంచి 25 కేజీల వరకు మునగ కాయలు దిగుబడి వచ్చేవి. దాదాపు ఏడెనిమిది ఏండ్ల తర్వాత ఒక్కో చెట్టు 50 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. ఏడాదికి సగటున 180 నుంచి 200 టన్నుల వరకు మునగ కాయలను పండిస్తున్నాడు సాగర్.
ఆర్గానిక్ పద్ధతుల్లోనే..
సాగర్.. మునగ సాగు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం ఆర్గానిక్ పద్ధతుల్లోనే సాగు చేశాడు. ఎందుకంటే దానిమ్మ సాగుకు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడంతో నష్టాలు చవిచూశాడు. ఈ నేపథ్యంలో మునగ సాగును ఆర్గానిక్ మెథడ్‌లోనే సాగు చేసి అధిక లాభాలను ఆర్జించాడు సాగర్. అయితే వర్షాలు ఎక్కువగా కురిసిన సమయంలో మునగ మొక్కలకు ఫంగల్ ఇన్‌స్పెక్షన్స్ వచ్చేవని, దాంతో ఎకరాకు అదనంగా రూ. 1.5 లక్షల ఖర్చు అయ్యేదని సాగర్ తెలిపాడు. ఫంగల్ ఇన్‌స్పెక్షన్స్ రాకపోతే కేవలం ఎకరాకు పెట్టుబడికి రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చయ్యేదని పేర్కొన్నాడు.

హైదరాబాద్‌కు తరలింపు
సాగర్ పండించిన మునగ కాయలను హైదరాబాద్ మార్కెట్‌కు తరలించేవాడు. దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి తన పంటను విక్రయించేవాడు. ప్రస్తుతం దుబాయికి కూడా ఎగుమతి చేస్తున్నాడు. అయితే హైదరాబాద్ నుంచే తన మునగ కాయలకు మంచి డిమాండ్ ఉందని సాగర్ తెలిపాడు.
శీతాకాలంలోనే డిమాండ్..
శీతాకాలంలో కేజీ మునగ కాయలను రూ. 200 వరకు విక్రయించేవాడు. అదే ఎండాకాలంలో అయితే కేజీ మునగ కాయలు రూ. 25 కే విక్రయం జరిగేది. ఏడాది మొత్తంలో కేజీ మునగను రూ. 50కి విక్రయిస్తున్నట్లు సాగర్ తెలిపాడు.
ఏడాదికి రూ. 80 లక్షలకు పైగా లాభం..
ఇక మునగకాయలు విక్రయించి.. ఎకరాకు ఏడాది కాలానికి రూ. 7 లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. మునగ కాయలతో పాటు వాటి గింజలను కూడా విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నాడు సాగర్. విత్తనాల ద్వారానే ఏడాదికి రూ. 15 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. కేజీ విత్తనాలను రూ. 10 వేలకు విక్రయిస్తున్నాడు. రూ. 1.15 కోట్ల వార్షిక టర్నోవర్‌పై, మునగకాయలు, వాటి విత్తనాల అమ్మకం ద్వారా కలిపి రూ. 80 లక్షలకు పైగా లాభం వస్తోందని సాగర్ పేర్కొన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Dutt | మంత్రి సమక్షంలోనే.. మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించిన బాలీవుడ్ స్టార్
సెప్టెంబర్ 7, 2026

CM Revanth Reddy | రుణమాఫీపై.. సిద్దిపేట గడ్డ మీద.. సిరిసిల్ల అడ్డా మీద చర్చకు సిద్ధం
సెప్టెంబర్ 5, 2026

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
- ●NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..
- ●Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు
- ●Bhatti Vikramarka - Sridhar Babu | కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం?
- ●PM Modi | మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం.. బీజేపీ కీలక ప్రకటన
- ●KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!

NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..

Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు

Bhatti Vikramarka - Sridhar Babu | కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం?



