త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | మాజీ దౌత్య‌వేత్త‌కూ త‌ప్పలేదు.. పౌర‌స‌త్వం నిరూపించుకోవాల‌న్న ఎస్ఐఆర్‌..

IR | ఆయ‌న ప‌లు దేశాల్లో భార‌త రాయ‌బారిగా (Ex-envoy) ప‌నిచేశారు. యూఏఈ, ఈజిప్టు స‌హా ప‌లు దేశాల్లో భార‌త రాయ‌బారిగా (Ambassador), ఆస్ట్రేలియాలో ఇండియ‌న్ హై క‌మిష‌న‌ర్‌గా (High Commissioner) దేశానికి సేవ‌లు అందించిన ఆ ఐఎఫ్ఎస్ మాజీ అధికారికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తిప్ప‌లు త‌ప్ప‌లేదు.

G

National | Published On Aug 24, 2026, 8.46 am IST

SIR | మాజీ దౌత్య‌వేత్త‌కూ త‌ప్పలేదు.. పౌర‌స‌త్వం నిరూపించుకోవాల‌న్న ఎస్ఐఆర్‌..
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్‌: ఆయ‌న ప‌లు దేశాల్లో భార‌త రాయ‌బారిగా (Ex-envoy) ప‌నిచేశారు. యూఏఈ, ఈజిప్టు స‌హా ప‌లు దేశాల్లో భార‌త రాయ‌బారిగా (Ambassador), ఆస్ట్రేలియాలో ఇండియ‌న్ హై క‌మిష‌న‌ర్‌గా (High Commissioner) దేశానికి సేవ‌లు అందించిన ఆ ఐఎఫ్ఎస్ మాజీ అధికారికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తిప్ప‌లు త‌ప్ప‌లేదు. త‌న ఓట‌రు వివ‌రాలు 2003 నాటి ఎస్‌ఐఆర్‌తో స‌రిపోలడం లేద‌ని, మీ పౌర‌స‌త్వం (Citizenship) నిరూపించుకోవాలంటూ ఆయ‌న‌కు నోటీసులు అందాయి.

దౌత్య‌వేత్త‌గా దేశానికి సేవ‌లు అందించిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి న‌వ‌దీప్ సింగ్‌ సూరి (Navdeep Singh Suri).. ప్ర‌స్తుతం పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో ఉంటున్నారు. ఎస్ఐఆర్‌లో భాగంగా తన ఓటరు వివరాలు 2003 నాటి రికార్డులతో సరిపోలడం లేదని, భారత పౌరసత్వాన్ని నిరూపించేందుకు పత్రాలు సమర్పించాలని అధికారులు కోరార‌ని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న సర్‌ (SIR) ప్రక్రియపై అస‌హ‌నం వ్య‌క్తంచేసిన ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు. `పంజాబ్‌లో ఎస్ఐఆర్‌ విషయంలో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. BLO (బూత్ లెవల్ ఆఫీసర్) వద్దకు వెళ్లి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు సమర్పించాను. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నాకు హామీ ఇచ్చారు. అయితే ఈరోజు ఒక వాలంటీర్ నుంచి మెసేజ్‌ వచ్చింది.

2003 నాటి SIR వివరాలతో కొన్ని అంశాలు సరిపోలడం లేదని అందులో తెలిపారు. నోటీసు తీసుకునేందుకు రావాలని, ఆ తర్వాత నేను భారతీయ పౌరుడినని నిరూపించే కొన్ని నిర్దిష్టంగా పేర్కొనని పత్రాలతో మళ్లీ రావాలని చెప్పారు. నేను 2003లో భారత్‌లో లేనని చెప్పాను. దాంతో పాస్‌పోర్ట్‌ను ఆధారంగా చూపించాలని వారు సూచించారు` అని చెప్పారు. తన వద్ద ఓటర్ ఐడీ, ఆధార్‌తో (Aadhaar card) పాటు ఇతర పత్రాలు కూడా ఉన్నాయని వెల్ల‌డించారు. మూడు దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత కూడా నా పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో నాకు ఇబ్బంది ఎదురైతే, సాధారణ పౌరుడి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. మూడు దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 2019లో పదవీ విరమణ చేసిన సూరికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితిగా మారింది. సొంత దేశంలోనే ఇప్పుడు ఆయన తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

Advertisement
Advertisement