Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
Crow | పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. ప్రాణాలతో ఉన్న కాకి( Crow )ని తినేందుకు యత్నించాడు. గమనించిన పక్షి ప్రేమికులు( Bird Lovers ).. ఆ వ్యక్తి నుంచి కాకిని కాపాడారు.
Crow | త్రినేత్ర.న్యూస్ : పీకల దాకా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. ప్రాణాలతో ఉన్న కాకి( Crow )ని తినేందుకు యత్నించాడు. గమనించిన పక్షి ప్రేమికులు( Bird Lovers ).. ఆ వ్యక్తి నుంచి కాకిని కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్( Nagpur )లో వెలుగు చూసింది.
నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తి కాకిని బంధించాడు. అనంతరం దాన్ని తన సైకిల్‌కు కట్టాడు. అది విలవిలలాడుతూ ఉంది. కాకిని పక్షి ప్రేమికులు గమనించారు. కాకిని బంధించిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గ్రహించారు. కాకిని ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నావని ప్రశ్నించారు.
కాకిని తినేందుకు తీసుకెళ్తున్నానని సదరు వ్యక్తి పక్షి ప్రేమికులకు సమాధానం ఇచ్చాడు. ఆగ్రహించిన వారు.. ఆ వ్యక్తిపై కర్రతో దాడి చేశారు. అనంతరం కాకిని చేరదీశారు. కాకిని ప్రాణాలతో కాపాడారు. కోలుకున్న అనంతరం కాకిని సురక్షితమైన ప్రదేశంలో వదిలేస్తామని పక్షి ప్రేమికులు చెప్పారు.
ఇక మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా, అతను దురుసుగా ప్రవర్తించాడు. కాకిని ఇచ్చేయాలని వాగ్వాదానికి దిగాడు. అతని క్రూరత్వంపై పక్షి ప్రేమికులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..
ఆగస్టు 14, 2026

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. ‘రాంప్’పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
ఆగస్టు 13, 2026

Aircraft Crash | బరామతిలో కూలిన ట్రైయినీ విమానం.. ఇద్దరు పైలట్లు సేఫ్
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
- ●Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం
- ●RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
- ●Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- ●Ponnam Prabhakar | ఐదు జిల్లాలు.. 85 పుష్కర ఘాట్లు.. 88 కోట్లు.. ఇదే గోదావరి పుష్కరాల కార్యాచరణ

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..

Traffic Restrictions | మరికాసేపట్లో నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు



