త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NDA | ఎన్నిక‌ల సంఘంలో అంత‌ర్గ‌త విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ ప‌క్షాలు

NDA | కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో (Election Commission) అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. చీఫ్ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (CEC) ఒంటెద్దు పోక‌డ‌ల‌పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

G

National | Published On Sep 26, 2026, 10.54 am IST

NDA | ఎన్నిక‌ల సంఘంలో అంత‌ర్గ‌త విభేదాలు.. అనుమానాలు తీర్చాలంటున్న ఎన్డీఏ ప‌క్షాలు
Advertisement

NDA | త్రినేత్ర న్యూస్‌: ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై (SIR) కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో (Election Commission) అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. చీఫ్ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (CEC) ఒంటెద్దు పోక‌డ‌ల‌పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) వెంట‌నే త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అధికార ఎన్డీఏ (NDA) కూట‌మిలోని పార్టీలు కూడా విప‌క్షాల‌తో గొంతుక‌లిపాయి. ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టత ఇవ్వాల‌ని ఎల్‌జేపీ (LJP), ఆర్ఎల్ఎం (RLM), టీడీపీ (TDP) వంటి పార్టీలు కోరుతున్నాయి. పార‌ద‌ర్శ‌క‌త అనేది రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించాయి.

ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌ధానంగా సీఈసీపై ఉంద‌ని కేంద్ర మంత్రి, LJP (రామ్ విలాస్‌) అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధానం ఇవ్వ‌డం కోసం కాకుండా, ఓట‌ర్ల‌లో సందేహాలు త‌లెత్త‌కుండా, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం కొన‌సాగేలా ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోయినా, సందేహాలు పెంచుకున్నా అది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. అందువ‌ల్ల ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌న వైఖ‌రిని మ‌రింత బ‌లంగా వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం ఉద‌న్నారు.

ప్ర‌జ‌ల్లో తీవ్ర అయోమ‌యం..

ఈ వివాదం ప్ర‌జ‌ల్లో తీవ్ర అయోమ‌యానికి దారితీసింద‌ని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్, రాజ్య‌స‌భ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఈసీ వెంటనే స్పందించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఎస్ఐఆర్ వివాదం ప్ర‌జ‌ల్లో తీవ్ర అయోమ‌యాన్ని సృష్టించింద‌ని, ఈ విష‌యాన్ని క‌చ్చితంగా ప‌రిష్క‌రించాల్సి ఉంద‌ని చెప్పారు. గందరగోళాన్ని తొలగించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే అసలు పరిస్థితిపై ఒక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు.

పార‌ద‌ర్శ‌క‌తే ప్ర‌ధానం..

ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని టీడీపీ (TDP) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishna Devarayalu) చెప్పారు. ప్రతీ ఓటరుకు తగిన సమయం, అవకాశం లభించాయని, ఏపీలో ప్రతిపక్షాలు కూడా ఈ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలనూ రుజువు చేయలేకపోయాయని తెలిపారు. మ‌న ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల సంఘం అనేది అత్యంత కీల‌క‌మైన బాధ్య‌త క‌లిగిన రాజ్యంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌. అలాంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థపై ప్రశ్నలు ఎదురైనప్పుడు సరైన వివరణ ఇవ్వడం, పార‌ద‌ర్శ‌క‌త‌ను చాట‌డం ద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రజలకు మరింత నమ్మకం బ‌ల‌ప‌డుతుందని చెప్పారు.

Advertisement
Advertisement