త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balti Review | బాల్తీ రివ్యూ – ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో సాగే లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

షేన్ నిగ‌మ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ బాల్తీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో రిలీజైన ఈ యాక్ష‌న్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Jul 16, 2026, 11.04 am IST

Balti Review | బాల్తీ రివ్యూ – ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో సాగే లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Balti Review | షేన్ నిగ‌మ్‌, ప్రీతి అస్రానీ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ బాల్తీ ఇటీవ‌లే సోనీ లివ్ ఓటీటీలో రిలీజైంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో సెల్వ రాఘ‌వ‌న్‌, శంత‌ను భాగ్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఉన్ని శివ‌లింగం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ల‌యాళంతో పాటు తెలుగులో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

క‌బ‌డ్డీ ఆట‌గాళ్ల క‌థ‌....

వేలంపాళ‌యం సిటీలో వ‌డ్డీ వ్యాపారం విష‌యంలో భైర‌వ‌న్ (సెల్వ రాఘ‌వ‌న్‌), సోడాబాబు (ఆల్పోన్సో పుత్రేన్‌) మ‌ధ్య చాలా ఏళ్లుగా గొడ‌వ‌లు న‌డుస్తుంటాయి. వ్యాపారంలోనే కాకుండా క‌బ‌డ్డీ పోటీల‌లో త‌మ జ‌ట్టే గెల‌వాల‌ని ఇద్ద‌రూ భావిస్తుంటారు. ఆ ఏరియాలో పంచ‌మి టీమ్ ఫేమ‌స్‌. భైర‌వ‌న్ జ‌ట్టును ఓడించి క‌ప్ గెలుస్తారు. త‌న ప్రాణ స్నేహితులు కుమార్ (శంత‌ను భాగ్య‌రాజ్‌), ర‌మేష్‌, మ‌ణి, ప్ర‌తాప్‌తో క‌లిసి ఉద‌య‌న్ (షేన్ నిగ‌మ్‌)పంచ‌మి టీమ్‌ను ఏర్పాటుచేస్తాడు. డ‌బ్బు కోసం సోడాబాబు జ‌ట్టులో ఆడ‌టానికి ఉద‌య‌న్ ఒప్పుకుంటాడు. కానీ సోడాబాబు కంటే మూడింత‌లు ఎక్కువ‌గా డ‌బ్బు ఇస్తాన‌ని భైర‌వ‌న్ అన‌డంతో కుమార్ బ‌ల‌వంతంతో భైర‌వ‌న్ టీమ్‌లో జాయిన్ అవుతారు ఉద‌య‌న్ అత‌డి స్నేహితులు. ఓ కారు విష‌యంలో సోడాబాబును కొట్టి భైర‌వ‌న్‌కు ద‌గ్గ‌ర అవుతారు. భైర‌వ‌న్ వ‌డ్డీ బిజినెస్ కార‌ణంగా ఉద‌య‌న్ ప్రియురాలు కావేరి (ప్రీతి అస్రానీ) అన్న‌య్య అవిటివాడు అవుతాడు. భైర‌వ‌న్‌పై కావేరి కేసు పెడుతుంది. ప్రియురాలికి అండ‌గా నిలిచే క్ర‌మంలో భైర‌వ‌న్‌ను ఎదురుతిరుగుతాడు ఉద‌య‌న్‌. ఆ త‌ర్వాత ఏమైంది? భైర‌వ‌న్ జ‌రిగిన గొడ‌వ‌లో ఉద‌య‌న్ స్నేహితులు ఎలా ప్రాణాలు కోల్పోయారు? స‌్నేహితుల‌కు ద్రోహం చేసిన కుమార్ జీవితం ఏమైంది? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

జ‌గ‌డం...స‌త్య‌....

అమాయ‌కులైన హీరో అత‌డి గ్యాంగ్‌....అనుకోకుండా క్రైమ్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట‌ర్‌కావ‌డం, తెలియ‌క చేసిన త‌ప్ప‌ట‌డుగు వారి జీవితాల‌ను ఎలా నాశ‌నం చేసింద‌నే కాన్సెప్ట్‌తో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో చాలానే సినిమాలు వ‌చ్చాయి. జ‌గ‌డం, ఓం, స‌త్య‌...ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. బాల్తీ కూడా అదే ఫార్మెట్‌లో రూపొందింది.

క‌బ‌డ్డీ బ్యాక్‌డ్రాప్‌కు ప్రేమ‌, స్నేహం, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఉన్నీ శివ‌లింగం ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఉద‌య‌న్‌, కుమార్ క‌లిసి ఓ హ‌త్య చేసే సీన్‌తోనే ఈ సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత హీరో అండ్ టీమ్ క‌బ‌డ్డీ పోటీల్లో గెల‌వ‌డం, మ‌రోవైపు భైర‌వ‌న్‌, సోడాబాబు వ‌డ్డీ బిజినెస్‌ల‌తో క‌థ‌ను బిల్డ్ చేస్తూ వెళ్లారు. భైర‌వ‌న్‌తో గొడ‌వ ప‌డిన హీరో అత‌డి స్నేహితులు చివ‌ర‌కుఅత‌డికే ద‌గ్గ‌ర కావ‌డం, అత‌డి బిజినెస్ ప‌నులు చూస్తూ క‌బ‌డ్డీని ప‌క్క‌న‌పెట్టే స‌న్నివేశాలు కాస్తంత బోర్ ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. తాను ప్రేమించిన అమ్మాయి కార‌ణంగా భైర‌వ‌న్‌ను ఉద‌య‌న్ ఎదురించ‌డం, స్నేహితుల‌కు స‌పోర్ట్‌గా ఉన్న‌ట్లుగా న‌మ్మిస్తూనే కుమార్ వేసే ఎత్తుల‌తో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌ల‌తో సాగుతుంది. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క‌బ‌డ్డీని న‌మ్ముకున్న ఉద‌య‌న్, క్రైమ్‌ను న‌మ్ముకున్న కుమార్ జీవితాలు ఏమ‌య్యాయ‌న్న‌ది చూపిస్తూ క‌న్వీన్సింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.

విల‌న్‌గా...

ఉద‌య‌న్ పాత్ర‌లో షేన్ నిగ‌మ్ బాడీలాంగ్వేజ్‌, యాక్టింగ్ బాగున్నాయి. మాస్ రోల్‌లో మెప్పించాడు. స్వార్థం కోసం స్నేహానికి ద్రోహం చేసే యువ‌కుడిగా నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో శంత‌ను భాగ్య‌రాజ్ న‌ట‌న బాగుంది. హీరోయిన్ ప్రీతి అస్రానీ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. భైర‌వ‌న్‌గా సెల్వ‌రాఘ‌వ‌న్ డైలాగ్స్‌తోనే విల‌నాజాన్ని పండించాడు. సోడాబాబుగా డైరెక్ట‌ర్ ఆల్పోన్స్ పుత్రేన్ న‌ట‌న ఒకే. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ సాయి అభ్యంక‌ర్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఇదే ఫ‌స్ట్ మూవీ. బీజీఎమ్ బాగుంది.

రొటీన్ కాన్సెప్ట్‌....

బాల్తీ కాన్సెప్ట్ రొటీన్ అయినా షేన్ నిగ‌మ్‌, సెల్వ రాఘ‌వ‌న్‌తో పాటు శంత‌ను భాగ్య‌రాజ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. తెలుగు డ‌బ్బింగ్ బాగుంది.

Advertisement
Advertisement