Prabhas Fauzi | అఫీషియల్ – ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ – యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ – పోస్టర్ వైరల్
ప్రభాస్ ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. 2026 డిసెంబర్ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ గురువారం ప్రకటించారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్‌లో యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ కనిపిస్తున్నారు.
Entertainment | Published On Jul 16, 2026, 11.56 am IST
Prabhas Fauzi | ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ఫౌజీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఫిక్సయ్యింది. హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫౌజీ మూవీతో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది.
యుద్ధభూమిలో....
ఫౌజీ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గురువారం ఈ పాన్ ఇండియన్ మూవీ విడుదల తేదీని వెల్లడించిన మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 3న ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌లో యుద్ధ భూమిలో ఒంటినిండా గాయాలతో ప్రభాస్ కనిపిస్తున్నారు. అతడి చుట్టూ వందలాది శవాలు ఉన్నాయి. ప్రభాస్ చేతిలో పాత కాలం నాటి తుపాకీ ఉంది. ఒంటరిగా పోరాడే ఓ సైనికుడు అంటూపోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఆ పక్కనే మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే స్టాంప్ కూడా ఉండటం ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో...
ఫౌజీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్లు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ తో పాటు జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సీనియర్ యాక్టర్లు...
ఫౌజీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్లు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కల్కి 2...స్పిరిట్...
ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. స్పిరిట్ మూవీకి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో స్పిరిట్ థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ – ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్
జులై 14, 2026

Jani Master | మా మధ్య గొడవలు లేవు – శేఖర్ మాస్టర్‌తో వివాదంపై జానీ మాస్టర్ కామెంట్స్
జులై 13, 2026

Tollywood | ఏడడుగులు వేశారు…హిట్టు కొట్టారు – పెళ్లి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోహీరోయిన్లు వీళ్లే!
జులై 13, 2026
తాజావార్తలు
- ●IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..
- ●Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
- ●MLC Venkatram reddy | డ్రగ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్..
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు సమయమేనా..?
- ●Balti Review | బాల్తీ రివ్యూ - ఊహలకు అందని ట్విస్ట్‌లతో సాగే లేటెస్ట్ మలయాళం యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
- ●Ashada Bonalu | ఘనంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. భక్తజన సందోహంగా గోల్కొండ

IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..

Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు

MLC Venkatram reddy | డ్రగ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్..

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు సమయమేనా..?



