త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Venkatram reddy | డ్ర‌గ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్‌..

MLC Venkatram reddy | హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ (Drugs) వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టించింది. గంజాయి (Ganja), హాష్ ఆయిల్ (Hash Oil) కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంక‌ట్రామ్‌రెడ్డి కుమారుడు (MLC Venkatram reddy) భ‌ర‌త్ పోలీసులకు ప‌ట్టుబ‌డ్డాడు.

G

Flash news | Published On Jul 16, 2026, 11.37 am IST

MLC Venkatram reddy | డ్ర‌గ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్‌..
Advertisement

MLC Venkatram reddy | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ (Drugs) వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టించింది. గంజాయి (Ganja), హాష్ ఆయిల్ (Hash Oil) కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంక‌ట్రామ్‌రెడ్డి కుమారుడు (MLC Venkatram reddy) భ‌ర‌త్ పోలీసులకు ప‌ట్టుబ‌డ్డాడు. అత‌నితో స‌హా ముగ్గురిని హెచ్ న్యూ పోలీసులు (H-NEW Police) అరెస్టు చేశారు. వారిని మంగ‌ళ్‌హాట్ పోలీసుల‌కు అప్ప‌గించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పురానాపూల్ ప్రాంతంలో గంజాయి, హాష్ ఆయిల్ కొనేందుకు ఏడుగురు వ్య‌క్తులు వ‌చ్చారు. అప్ప‌టికే వారిపై నిఘావేసిన హెచ్‌న్యూ పోలీసులు.. ఎమ్మెల్సీ కుమారుడు భ‌ర‌త్ రాజ్ రెడ్డి, అభిషేక్‌, బొట్టు యూనిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వ‌ద్ద 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు న‌మోదుచేశారు. మ‌రో న‌లుగురు ప‌రార‌య్యారు. వారికోసం ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చేప‌ట్టారు. ప‌ట్టుబ‌డిన వారిని ఉస్మానియా ద‌వాఖాన‌కు త‌ర‌లించి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

కాగా, ఎమ్మెల్సీ వెంక‌ట్రామ్ రెడ్డి కుమారుడు భ‌త‌ర్ రాజ్ రెడ్డి భార్య విడాకులు తీసుకోవ‌డంతో అత‌డు మాన‌సింగ కుంగిపోయాడు. దీంతో డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారిన అత‌డు.. వాటిని కొనుగోలు చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు.

Advertisement
Advertisement