Traffic Restrictions | ఆషాఢ బోనాలు.. జగన్నాథుని రథయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల (Ashada Bonalu) వేడుకకకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండలోని శ్రీ జగదాంబికా అమ్మవారికి తొలి బోనంతో (Golconda Bonalu) ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రధాన రహదారుల మీదుగా సాగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల (Ashada Bonalu) వేడుకకకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండలోని శ్రీ జగదాంబికా అమ్మవారికి తొలి బోనంతో (Golconda Bonalu) ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర, బోనాన్ని లంగర్‌హౌస్ నుంచి ఘన ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రధాన రహదారుల మీదుగా సాగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. పెద్ద ఎత్తున్న భక్తులు, ప్రజలు ఈ వేడుకల్లో పాలుపంచుకోనుండటంతో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీచేశారు.
గోల్కొండ కోటలో జరిగే శ్రీ జగదాంబ మహాకాళి బోనాల ఉత్సవాలు-2026 సందర్భాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జూలై 16, 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గోల్కొండ కోటకు వచ్చే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
రామ్‌దేవ్‌గూడ నుంచి మక్కాయ్ దర్వాజా మీదుగా గోల్కొండ కోట, లంగర్ హౌస్ నుంచి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట, షేక్‌పేట నాలా, సెవెన్ టూంబ్స్ (ఏడు సమాధులు) నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోట వరకు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయా తేదీల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌస్ వైపు నుంచి మక్కాయ్ దర్వాజా – గోల్కొండ కోట – బంజారా దర్వాజా మీదుగా షేక్‌పేట్ – ఫిలింనగర్ – గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రామ్‌దేవ్‌గూడ వద్ద లంగర్ హౌస్ – బాలికా భవన్ – నానల్ నగర్ వైపు.
- ఫిలింనగర్, షేక్‌పేట్ వైపు నుంచి బంజారా దర్వాజా – మక్కాయ్ దర్వాజా మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను బంజారా దర్వాజా వెలుపల అల్జాపూర్ రోడ్ – నెక్నాంపూర్ వైపు.
- మొఘల్ కా నాలా వైపు నుంచి లంగర్ హౌస్ – ఫతే దర్వాజా – గోల్కొండ కోట వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద బాలికా భవన్ – నానల్ నగర్ వైపు వాహనాలు మళ్లిస్తారు.
పార్కింగ్ ఎక్కడ అంటే..
గోల్కొండ బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ వాహనాలను అక్కడ నిలిపి, కాలినడకన రావాల్సి ఉంటుంది.
- రామ్‌దేవ్‌గూడ వైపు నుంచి మక్కాయ్ దర్వాజా మీదుగా వచ్చే భక్తుల కోసం.. ఆషూర్ ఖానా నుండి ఆర్మీ సెంట్రీ పోస్ట్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆర్టిలరీ సెంటర్ వద్ద 3, 4 చక్రాల వాహనాలు, మరియు బస్సులు
- లంగర్ హౌస్ వైపు నుంచి ఫతే దర్వాజా మీదుగా వచ్చే భక్తుల కోసం.. హుడా (HUDA) పార్క్, ఫతే దర్వాజా వద్ద ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ద్విచక్ర వాహనాలు, ఒవైసీ గ్రౌండ్ వద్ద ఇతర వాహనాలు
- షేక్‌పేట్ వైపు నుంచి బంజారా దర్వాజా మీదుగా వచ్చే భక్తుల కోసం.. హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్ 4 చక్రాల వాహనాలు, ఏరియా హాస్పిటల్ వద్ద ద్విచక్ర వాహనాలు, డెక్కన్ పార్క్, సెవెన్ టూంబ్స్ వద్ద 4 చక్రాల వాహనాలు, బస్సులు.

జగన్నాథుని రథయాత్ర..
జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు అబిడ్స్ ఇస్కాన్ యాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు బంజారాహిల్స్ ఆలయ రథయాత్ర ఉంటుంది. దీంతో రోడ్ నంబర్ 12, ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.
ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DGP Anand | సైబర్ ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయ్.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది
జులై 16, 2026

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
జులై 16, 2026

Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు
జులై 16, 2026
తాజావార్తలు
- ●Fast Eating Psychology | ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయిందా? చాలా ఫాస్ట్‌గా ఫుడ్ తినేసే వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
- ●EHCT | ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కొత్త ఊపు.. ఈహెచ్‌సీటీకి పూర్తి అధికారాలు
- ●Sonam Wangchuk Fast | శరీరం తనను తానే తినేస్తుందా? 19 రోజుల వాంగ్‌చుక్ దీక్షతో దేహంలో జరిగే భయంకర మార్పులివే!
- ●E20 Case | మారుతీకి షాక్ ఇచ్చిన కన్జ్యూమర్స్ కోర్టు.. కొత్త కార్ లేకుంటే.. రూ.20.50లక్షలు చెల్లించాలని ఆదేశం..!
- ●TG20 League Winners | క్రీడాకారులకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్.. క్యాష్ రివార్డ్స్, గవర్నమెంట్ జాబ్స్ పక్కా
- ●Minister Vivek | ఘనంగా తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’..

Fast Eating Psychology | ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయిందా? చాలా ఫాస్ట్‌గా ఫుడ్ తినేసే వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో తెలుసా?

EHCT | ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కొత్త ఊపు.. ఈహెచ్‌సీటీకి పూర్తి అధికారాలు

Sonam Wangchuk Fast | శరీరం తనను తానే తినేస్తుందా? 19 రోజుల వాంగ్‌చుక్ దీక్షతో దేహంలో జరిగే భయంకర మార్పులివే!

E20 Case | మారుతీకి షాక్ ఇచ్చిన కన్జ్యూమర్స్ కోర్టు.. కొత్త కార్ లేకుంటే.. రూ.20.50లక్షలు చెల్లించాలని ఆదేశం..!



