Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు సమయమేనా..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నా బులియన్ మార్కెట్లలో మాత్రం ఇంకా తీవ్ర అస్థిరత కొనసాగుతూనే ఉంది. బంగారం, వెండి ధరల్లో ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నా బులియన్ మార్కెట్లలో మాత్రం ఇంకా తీవ్ర అస్థిరత కొనసాగుతూనే ఉంది. బంగారం, వెండి ధరల్లో ఇటీవలి కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల కొత్తగా వీటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు కొంతకాలం పాటు వేచి చూస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో గురువారం ఔన్స్ బంగారం ధర భారీగా తగ్గింది. ఏకంగా 0.80 శాతం మేర తగ్గిన పసిడి ధర ప్రస్తుతం 4,028 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.16 శాతం మేర పతనమై 57 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 675 పాయింట్లు తగ్గి 1,41,174కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,464 పాయింట్లు తగ్గి 2,19,156కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,329 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 632గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,32,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,135 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,13,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,747 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,976గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,470 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,74,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!






