త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DSC | 2721 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. ఈ నెల 11 నుంచి ద‌ర‌ఖాస్తులు

DSC | 2721 పోస్టుల‌తో డీఎస్సీ (DSC) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 11 నుంచి ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు.

G

National | Published On Nov 5, 2026, 12.55 pm IST

DSC | 2721 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. ఈ నెల 11 నుంచి ద‌ర‌ఖాస్తులు
Advertisement

DSC | త్రినేత్ర న్యూస్‌: ఉపాధ్యాయ ఉద్యోగార్థుల‌కు ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింది. 2721 పోస్టుల‌తో డీఎస్సీ (DSC) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 11న ద‌ర‌ఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు. రాత‌ప‌రీక్ష‌ను కంప్యూట‌ర్ ఆధారితంగా నిర్వ‌హిస్తారు.

మొత్తం పోస్టులు: 2721
ఇందులో స్కూల్ అసిస్టెంట్‌, ఎస్టీజీ పోస్టులు 2111, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ పోస్టులు 350 (ఎస్ఏ 150, ఎస్జీటీ 200), ప్రిన్సిప‌ల్‌, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టులో బీఈడీ, బీపీఈడీ పూర్తిచేయాలి. ఏపీటెట్ లేదా సీటెట్‌లో ఉత్తీర్ణుల‌వ్వాలి. అభ్య‌ర్థులు 2026 జూలై 1 నాటికి 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏండ్లు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 11
అప్లికేష‌న్ ఫీజు: రూ.1000
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 30
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌: డిసెంబ‌ర్ 14 నుంచి
రాత‌ప‌రీక్ష‌: 2026 డిసెంబ‌ర్ 20 నుంచి 2027 జ‌న‌వ‌రి 13 వ‌ర‌కు
వెబ్‌సైట్‌: https://tet2dsc.apcfss.in

పూర్తి వివ‌రాల‌కు..

DSC-2026 School Education Notification

DSC-2026 Societies Notification

DSC-2026 School Education Spl Notification

Advertisement
Advertisement