త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirupati Laddu Adulteration Case | ఇంకో రాష్ట్రానికి బ‌దిలీ చేయ‌లేం.. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ కేసులో ‘సుప్రీం’ తీర్పు

Tirupati Laddu Adulteration Case | తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ కల్తీ కేసు (Tirupati Laddu Adulteration Case)లో సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది.

S

National | Published On Nov 5, 2026, 12.53 pm IST

Tirupati Laddu Adulteration Case | ఇంకో రాష్ట్రానికి బ‌దిలీ చేయ‌లేం.. తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ కేసులో ‘సుప్రీం’ తీర్పు
Advertisement

Tirupati Laddu Adulteration Case | త్రినేత్ర న్యూస్: తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ కల్తీ కేసు (Tirupati Laddu Adulteration Case)లో సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. లడ్డూ కల్తీ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్ర‌దేశ్‌లోనే విచార‌ణ కొనసాగుతుంద‌ని గురువారం తేల్చి చెప్పింది.

లడ్డూ కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ బయటకు మార్చాలని కోరుతూ ప్రయివేట్‌ డెయిరీ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ మశ్చీంద్ర శాంతారామ్ అత్యున్నత నాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

కోర్టు పర్యవేక్షణలో ఇప్పటికే నియమితమైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పారదర్శకంగా విచారణ జరుపుతోందని పేర్కొంది. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన ప‌ని లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

Advertisement
Advertisement