Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ – వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా మూవీ కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 2న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జూలై 31న రిలీజ్ కావాల్సిన దళపతి విజయ్ జననాయగన్ కారణంగా వాయిదాపడింది. సిగ్మాతోనే దర్శకుడిగా జాసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Entertainment | Published On Aug 18, 2026, 11.45 am IST
Jason Sanjay | తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సిగ్మా మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సేమ్ టైటిల్‌తో రిలీజ్ కాబోతుంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో కేథరిన్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
జననాయగన్ కారణంగా...
ఈ ఏడాది జూలై 31న సిగ్మాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ జూలై 23న దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్ కావడంతో సిగ్మా వాయిదాపడింది. తండ్రి దళపతి విజయ్ సినిమా కోసం జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రచారం జరిగింది.
వెంకటేష్‌తో పోటీ...
తాజాగా సిగ్మా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం రివీల్ చేశారు. అక్టోబర్ 2న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 2న వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం థియేటర్లలోకి రాబోతుంది. వెంకటేష్ సినిమాకు పోటీగా జాసన్ సంజయ్ తొలి మూవీ విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది.
తండ్రితో అనుబంధం...
సిగ్మా మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. జాసన్ సంజయ్ డెబ్యూ మూవీ కావడంతో తమిళనాట ఈ సినిమాపై భారీగా క్రేజ్ నెలకొంది. సిగ్మా ప్రమోషన్స్‌లో తండ్రితో తనకున్న అనుబంధంపై జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తానంటే తొలుత తండ్రి తనను ప్రోత్సహించాడని చెప్పాడు. తండ్రి దళపతి విజయ్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నదే డ్రీమ్ అని జాసన్ సంజయ్ అన్నాడు. సిగ్మా మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. రాజు సుందరం, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Faria Abdullah | బోనాల జాతరలో పాల్గొనడంపై విమర్శలు – ఫరియా అబ్దుల్లా ఎమోషనల్
ఆగస్టు 15, 2026

Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ – తెలంగాణ కల్చర్‌కు ఫిదా
ఆగస్టు 10, 2026

Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ●IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!

Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్

IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే



