త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | రాష్ట్ర స‌చివాల‌యం ఎదుట ఏర్పాటు చేసిన‌ బహుజన యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించ‌నున్నారు.

S

Hyderabad | Published On Aug 18, 2026, 7.43 am IST

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర స‌చివాల‌యం ఎదుట ఏర్పాటు చేసిన‌ బహుజన యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించ‌నున్నారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించే స‌భ‌లో రేవంత్ ప్ర‌సంగించనున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ నేప‌థ్యంలో స‌చివాల‌యం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. ఇక్బాల్ మినార్ నుంచి ఓల్డ్ అంబేద్క‌ర్ జంక్ష‌న్, ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌న్నారు. ఈ మార్గాల్లో వ‌చ్చే వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవాల‌ని పోలీసులు సూచించారు.

Advertisement
Advertisement