త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్ష‌లు.. రూట్ మ్యాప్ ఇదే

KBR Park | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో హెచ్ సిటీ ప్రాజెక్టు( H City Project ) ప‌నుల కార‌ణంగా.. మంగ‌ళ‌వారం నుంచి కేబీఆర్ పార్కు( KBR Park ) చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions )అమ‌లు చేయ‌నున్నారు.

S

Hyderabad | Published On Aug 18, 2026, 7.16 am IST

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్ష‌లు.. రూట్ మ్యాప్ ఇదే
Advertisement

KBR Park | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో హెచ్ సిటీ ప్రాజెక్టు( H City Project ) ప‌నుల కార‌ణంగా.. మంగ‌ళ‌వారం నుంచి కేబీఆర్ పార్కు( KBR Park ) చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions )అమ‌లు చేయ‌నున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ వ‌న్ వే ఉంటుంద‌ని, వాహ‌న‌దారులు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు ఏడాదిన్న‌ర పాటు కొన‌సాగ‌నున్నాయి.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే.. రైట్ టర్న్ బంద్

హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ చుట్టూ పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ పనుల కారణంగా 2026 ఆగస్టు 18 నుంచి ఆ పార్క్ చుట్టూ కొత్త వన్ వే (One way) ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. భారీ నిర్మాణ పనులు ఉన్నందున ఈ వన్-వే రూల్స్ సుమారు ఏడాదిన్నర పాటు (1.5 years) అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏ రోడ్డులోనూ కుడి వైపునకు తిరగడం (Right turn) పూర్తిగా నిషేధం.

ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు లేన్ మారడానికి 10 లేన్ చేంజర్లు, 13 ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే.

పంజాగుట్ట టు కేబుల్ బ్రిడ్జి:

రైట్ టర్న్ తీసుకోకూడదు. ఎన్టీఆర్ భవన్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని, తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద లేన్ మార్చుకుని, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, ఫీనిక్స్ బిల్డింగ్ మీదుగా కేబుల్ బ్రిడ్జి చేరుకోవాలి.

యూసుఫ్‌గూడ/శ్రీనగర్ కాలనీ టు మాదాపూర్:

ఇందిరానగర్ గడ్డ రోడ్ లేదా వెంకటగిరి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని, రోడ్ నెం. 10 (డైమండ్ హౌస్, అల్కాజర్) వద్ద మళ్లీ కుడివైపు తిరిగి రోడ్ నెం. 36 మీదుగా మాదాపూర్ వెళ్లాలి.

కేబుల్ బ్రిడ్జి టు రోడ్ నెం.12:

రోడ్ నెం. 45 జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని, వెంటనే కుడి లేన్‌లోకి మారాలి. జూబ్లీ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా వెళ్లి బీఆర్ఎస్ భవన్ వద్ద లేన్ మారి రోడ్ నెం. 12 వైపు వెళ్లాలి.

Advertisement
Advertisement