Supreme Court | ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
Supreme Court | ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ ప్రవేశపెట్టడంలో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి తమ ప్రజల ఆరోగ్యం అంటే పట్టింపు లేదా ? అని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.
Supreme Court | ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ ప్రవేశపెట్టడంలో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి తమ ప్రజల ఆరోగ్యం అంటే పట్టింపు లేదా ? అని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తప్పనిసరిగా ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజ్ వార్నింగ్ లేబుల్స్ (ఎఫ్‌ఓపీఎల్) ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరుతూ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ 3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
చర్యలు తీసుకుంటారా, ఆదేశాలు జారీ చేయాలా..
జస్టిస్ జె.బి. పర్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఓపీఎల్ లేబుల్స్ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లలు జంక్ ఫుడ్‌కు అలవాటుపడుతున్న నేపథ్యంలో, ఆహార పదార్థాల్లోని అనారోగ్యకరమైన పదార్థాలపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ బృజేందర్ చాహర్‌ను ఉద్దేశించి జస్టిస్ పర్దీవాలా మాట్లాడుతూ.. మీరు కోర్టును ఆటపట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. లేబులింగ్ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. తాము ఈ పని ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్నామని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమ కోసం తాము ఇలా చేయడం లేదని తెలిపారు.తమ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడి తమకు తెలుసని, స్వయంగా దీనిపై చర్యలు తీసుకుంటారా? లేక తామే ఒక ఆదేశం జారీ చేయాలా? అని జస్టిస్ పర్దీవాలా పేర్కొన్నారు.
అధికమవుతున్న జీవనశైలి వ్యాధులు..
దేశంలో పెరుగుతున్న వ్యాధుల భారాన్ని కూడా ఈ పిటిషన్ ప్రస్తావించింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై ఎఫ్‌ఓపీఎల్ లేబుల్స్ ఉంటే అధిక స్థాయిలో ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందుతుందని పిటిషన్ పేర్కొంది. ఇవే మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా జీవనశైలి సంబంధిత వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంటువ్యాధులు కాని వ్యాధుల కారణంగా దేశంలో ప్రతి ఏడాది 60 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా మధుమేహం నిశ్శబ్ద మహమ్మారిగా మారుతోందని, దేశంలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తోందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
ఆగస్టు 13, 2026

FSSAI | పిల్లల ఆహారంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొత్త నిబంధనలు.. షుగర్, ఉప్పు, కొవ్వుకు పరిమితులు..
ఆగస్టు 11, 2026

Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్
- ●CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్డ్గా ఫీజు రీయింబర్స్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!
- ●Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?
- ●BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం

CM Revanth Reddy | మా లాంటోళ్లం థర్డ్ క్లాస్‌లో రిజల్ట్ చూసుకునేటోళ్లం : సీఎం రేవంత్ రెడ్డి

Kayadu Lohar | నితిన్‌కు రుక్మిణి దొరికిందా? - రచయితగా కయదు లోహర్

CM Revanth Reddy | ఇక నుంచి అడ్వాన్స్డ్గా ఫీజు రీయింబర్స్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి

1947 రియల్ సీక్రెట్స్: కేవలం స్వాతంత్య్రం మాత్రమే కాదు... భారత్ విలీనం వెనుక మిలిటరీ థ్రిల్లర్ ఇది!



