త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ఘోర ప్ర‌మాదం.. 8 మంది కూలీలు మృతి

Road Accident | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని భిండ్ (Bhind) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న పిక‌ప్ వెహిక‌ల్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును బ‌లంగా ఢీకొట్టింది (pick up vehicle collides with truck). ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది కూలీలు (labourer) మృతి చెందారు.

D

National | Published On Aug 18, 2026, 12.11 pm IST

Road Accident | ఘోర ప్ర‌మాదం.. 8 మంది కూలీలు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని భిండ్ (Bhind) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న పిక‌ప్ వెహిక‌ల్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును బ‌లంగా ఢీకొట్టింది (pick up vehicle collides with truck). ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది కూలీలు (labourer) మృతి చెంద‌గా.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. భిండ్-గ్వాలియర్ జాతీయ రహదారిపై చిమ్కా గ్రామం సమీపంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతానికి చెందిన కూలీలు గ్వాలియర్‌లో వరి నాట్లు వేసే ప‌ని పూర్తి చేసుకొని ఇంటికి తిరుగుప‌య‌న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో వారు ప్ర‌యాణిస్తున్న పిక‌ప్ వ్యాన్ మార్గం మ‌ధ్య‌లో ప్ర‌మాదానికి గురైంది. రహ‌దారిపై ప‌శువుల‌ను త‌ప్పించే క్ర‌మంలో డ్రైవ‌ర్ వాహ‌నంపై నియంత్ర‌ణ కోల్పోయాడు. ఈ క్ర‌మంలో ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కును బ‌లంగా ఢీ కొట్టాడు. ప్రమాదం దాటికి వాహనం తీవ్రంగా దెబ్బతిన్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను గోహద్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే, గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Also Read..

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై భార‌త్‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవాలి : అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌

సీఎం విజ‌య్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ - వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ సినిమాతో పోటీ!

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో భారీగా ఉద్యోగాలు.. వివ‌రాలివే..

Advertisement
Advertisement