Neeraj Yadav | ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Neeraj Yadav | ఆసియా గేమ్స్‌లో మూడుసార్లు స్వర్ణపతకాలు గెలుచుకున్న (Asian Para Games gold medallist) ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (Neeraj Yadav) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి అతడు తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Neeraj Yadav | త్రినేత్ర న్యూస్ : ఆసియా గేమ్స్ (Asian Para Games)లో మూడుసార్లు స్వర్ణపతకాలు గెలుచుకున్న ప్రముఖ పారా అథ్లెట్ (Top para athlete) నీరజ్ యాదవ్ (Neeraj Yadav) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 42 ఏళ్లు. డోపింగ్ సస్పెన్షన్ (doping suspension) కారణంగా ఈ నెలలో జరగాల్సిన ఐచి-నగోయా ఆసియా పారా గేమ్స్ నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన నీరజ్.. బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి అతడు తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, నీరజ్ మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ యాదవ్‌కు.. పారా అథ్లెట్లలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. భారత్ గర్వించదగ్గ పారా-అథ్లెట్లలో ఆయన ఒకరు. ఆసియా పారా గేమ్స్‌లో నీరజ్ మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. 2018 జకార్తాలో జరిగిన పోటీల్లో జావెలిన్ త్రోలో మొదటి బంగారు పతకాన్ని సాధించారు. ఆ తర్వాత 2023లో హాంగ్‌జౌలో జరిగిన జావెలిన్, డిస్కస్లలో రెండింటిలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. 2023లో హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్ తర్వాత బెంగుళూరులో సేకరించిన శ్యాంపిల్ ఆధారంగా అతను డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. అప్పటి నుంచి అతడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ఆయన మరణ వార్తను భారతీయ పారా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎస్ సత్యనారాయన ధృవీకరించారు. డోపింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తాను యాదవ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read..
భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు
టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ
20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీలక ప్రతిపాదన
తాజావార్తలు
- ●Apple | యాపిల్ కొత్త ఐమ్యాక్, మ్యాక్‌బుక్ ప్రొ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే..?
- ●India invites Pakistan | భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు
- ●Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌరవం.. స్మిత్‌ను అత్యున్నత పురస్కారంతో సత్కరించిన యూఏఈ
- ●Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
- ●Ponnam Prabhakar | చరిత్రలో నిలిచిపోయేలా.. భవిష్యత్ తరాలకు అందించేలా ఉస్మానియా దవాఖాన నిర్మాణం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Rahul Gandhi | టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

Apple | యాపిల్ కొత్త ఐమ్యాక్, మ్యాక్‌బుక్ ప్రొ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే..?

India invites Pakistan | భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు

Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌరవం.. స్మిత్‌ను అత్యున్నత పురస్కారంతో సత్కరించిన యూఏఈ

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు



