త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బ‌తకడానికి చావడానికి కాదు

Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్లు తాగేది బ‌త‌క‌డానికి చావ‌డానికి కాదు అని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో ఈ రెండు విష‌మ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Oct 28, 2026, 3.23 pm IST

Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బ‌తకడానికి చావడానికి కాదు
Advertisement

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో ఈ రెండు విష‌మ‌య్యాయి
రెండో రోజు పాద‌యాత్ర సంద‌ర్భంగా ఎంపీ ఈట‌ల

Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : గాలి పీల్చేది, నీళ్లు తాగేది బ‌త‌క‌డానికి చావ‌డానికి కాదు అని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో ఈ రెండు విష‌మ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఘట్‌కేస‌ర్ మండల కేంద్రంలో ఈట‌ల రాజేంద‌ర్ రెండో రోజు పాదయాత్ర నిర్వహించారు. ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త పురుషోత్తం రెడ్డి ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కోర్టు తీర్పులను త‌ప్పుదోవ పట్టించడం వల్ల ఈ సమస్య తీరడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దు. పురుషోత్తం రెడ్డి చెప్పినట్లు స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు. కోర్టులు తీర్పులు ఇచ్చాయి, మేధావులు పరిష్కారం మార్గాలు చెబుతున్నారు. అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి. ఇక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల వందల మంది చనిపోయారు.. వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి. డబ్బులు లేక కాంట్రాక్టర్ పనిచేయడం లేదు.. అంత దరిద్రంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని ఈట‌ల రాజేంద‌ర్ ధ్వ‌జ‌మెత్తారు.

అనంతం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ఇరవై ఐదేళ్ల క్రితం జవహర్ నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఇరవై ఐదేళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశాం. జస్టిస్ స్వతంత్ర కుమార్ జవహర్ నగర్ డంప్ యార్డు ఎత్తివేయాలని ఆర్డర్ ఇచ్చారు. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈటల రాజేందర్ మనకోసం పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతు తెలుపడం మనందరి బాధ్యత. మనం పీల్చే గాలి స్వచ్చంగా ఉండాలి అది మన హక్కు. ఇక్కడ గాలి విషం అయ్యింది. గాలి పీల్చేది బ‌తకడానికి చావడానికి కాదు. గార్బేజ్ నుండి వచ్చే లీచెట్ వల్ల తాగే నీళ్ళు కలుషితం అయ్యాయి. తాగితే జబ్బులు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. బ‌త‌క‌డం మ‌న హ‌క్కు. ఆ హక్కు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.

ఈ పాద‌యాత్ర‌లో ఘ‌ట్‌కేస‌ర్ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నేతల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మెకానిక్ సంఘం, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ కాలేజీల విద్యార్థులు, పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు వ్యర్థాలు వాగులో కలుపుతున్నారు. డంప్ యార్డు మురుగు కలిసి ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఈటల రాజేందర్‌కు వివరించారు.

Advertisement
Advertisement