Supreme Court | ఫారం-6లో మార్పులపై పిటిషన్.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court | ఎన్నికల సంఘం, సర్ వివాదం, ఫారం-6లో చేసిన మార్పులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచారణ జరిపింది. స్పందించిన సీజేఐ ధర్మాసనం అన్ని అంశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : సర్ (SIR) అమలు సమయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతి లేకుండానే ఫారం 6లో మార్పులు చేశారంటూ రాజ్యసభ ఎంపీ డోలా సేన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎంపీ డోలా సేన్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు.
ఫారం 6లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించిందని ఎన్నికల సంఘం తప్పుడు ప్రెస్‌నోట్ విడుదల చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తాము అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) వ్యవహారశైలి, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైనా సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్ ప్రక్రియను సమర్థిస్తూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 10 రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనంతరం అన్ని పిటిషన్లపై విచారణను నవంబర్ 17కు వాయిదా వేశారు.
Also Read..
న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
సంబంధిత వార్తలు

Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
అక్టోబర్ 27, 2026

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
అక్టోబర్ 27, 2026

Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Thriller OTT | ఓటీటీలోకి దళపతి విజయ్ కొడుకు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ - ఐదు భాషల్లో రిలీజ్
- ●Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
- ●Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం
- ●Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు
- ●Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
- ●CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి

Thriller OTT | ఓటీటీలోకి దళపతి విజయ్ కొడుకు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ - ఐదు భాషల్లో రిలీజ్

Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం

Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు



