త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FMG Doctors | ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్లపై పోలీసుల దాడి

FMG Doctors | హైదరాబాద్‌ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు నెలకు రూ.29 వేల స్టైఫండ్‌ ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలకే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (FMG) డాక్టర్లు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

S

Telangana | Published On Nov 6, 2026, 4.57 pm IST

FMG Doctors | ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్లపై పోలీసుల దాడి
Advertisement

రూ.29 వేల స్టైఫండ్‌ ఇవ్వాల్సింది పోయి
రూ.5 వేలకే పరిమితం చేయడంపై నిరసన

FMG Doctors | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు నెలకు రూ.29 వేల స్టైఫండ్‌ ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలకే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (FMG) డాక్టర్లు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న డాక్టర్లపై పోలీసులు దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు డాక్టర్లకు తీవ్ర గాయాలయ్యాయని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా పోలీసులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న సుమారు 600 మంది డాక్టర్లను అదుపులోకి తీసుకుని డబీర్‌పురా, అఫ్జల్‌గంజ్‌ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు.

తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన చేపడితే పోలీసుల నుంచి ఇలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని డాక్టర్ చేతన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement