Bengaluru | మర్మాంగాలను చూపించిన డెలివరీ బాయ్.. షాకైన మహిళ
Bengaluru | ఓ పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన సదరు డెలివరీ బాయ్ పాడు పనికి పాల్పడ్డాడు. అత్యవసరంగా టాయిలెట్ వస్తుందని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళ నివాసంలోకి చొరబడ్డాడు. వాష్‌రూమ్‌లో నుంచి తిరిగివస్తూ మహిళకు డెలివరీ బాయ్ మర్మాంగాలు చూపించడంతో ఆమె షాకైంది.
Bengaluru | త్రినేత్ర.న్యూస్ : ఓ పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన సదరు డెలివరీ బాయ్ పాడు పనికి పాల్పడ్డాడు. అత్యవసరంగా టాయిలెట్ వస్తుందని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళ నివాసంలోకి చొరబడ్డాడు. వాష్‌రూమ్‌లో నుంచి తిరిగివస్తూ మహిళకు డెలివరీ బాయ్ మర్మాంగాలు చూపించడంతో ఆమె షాకైంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో చోటు చేసుకుంది.
బాధిత మహిళ కథనం ప్రకారం.. తాను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానని, దాంతో పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు ఓ డెలివరీ బాయ్ తమ ఇంటికి వచ్చాడు. ఇక డోర్ తీయగానే పార్శిల్‌ను అందించాడు. తనకు టాయిలెట్ అర్జంట్ అని చెప్పాడు డెలివరీ బాయ్. పొరుగున అబ్బాయిల గది ఉంది.. అందులోకి వెళ్లమని చెప్పాను. కానీ తను అక్కడికి వెళ్లకుండా బలవంతంగా తన ఇంట్లోకి చొరబడి వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. నేను భయంతో డోర్ దగ్గర వచ్చి ఆగాను. ఇక వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తూ అతను తనకు మర్మాంగాలను చూపించాడు. నేను షాక్‌కు గురయ్యాను. ఆ సమయంలో మా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరింత భయాందోళనకు గురయ్యాను. ఎందుకంటే ఇటీవలి కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి కాబట్టి. ఆ డెలివరీ బాయ్ ప్రవర్తన నన్ను ఎంతో ఇబ్బందికి గురి చేసింది. నా ఇంట్లోనే నాకు భద్రత కరువైందన్న ఆందోళన కలిగించిందని బాధిత మహిళ పేర్కొంది.
అయితే ఈ సోషల్ మీడియా పోస్టుపై బెంగళూరు పోలీసులు స్పందించారు. బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ బాధితురాలి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, డెలివరీ బాయ్‌ను పట్టుకుంటామన్నారు. విచారణలో బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమని తేలితే, డెలివరీ బాయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
- ●Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్
- ●Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..
- ●Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ●Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
- ●MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్జీలు : ఎంపీ మల్లు రవి

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?

Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి






