త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala | ఐదుగురికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన చిన్నారికి క‌న్నీటి వీడ్కోలు

Kerala | కేర‌ళ (Kerala)లో అతిపిన్న వ‌య‌స్కురాలైన అవ‌య‌వ‌దాత (Organ Donor) అలిన్ షెరిన్ అబ్రహం (Aalin Sherin Abraham) అంత్య‌క్రియ‌లు (funeral) అధికారిక లాంఛ‌నాల‌తో పూర్త‌య్యాయి.

D

National | Published On Feb 16, 2026, 10.51 am IST

Kerala | ఐదుగురికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన చిన్నారికి క‌న్నీటి వీడ్కోలు
Advertisement

Kerala | కేర‌ళ (Kerala)లో అతిపిన్న వ‌య‌స్కురాలైన అవ‌య‌వ‌దాత (Organ Donor) అలిన్ షెరిన్ అబ్రహం (Aalin Sherin Abraham) అంత్య‌క్రియ‌లు (funeral) అధికారిక లాంఛ‌నాల‌తో పూర్త‌య్యాయి. ఆదివారం సాయంత్రం ప‌త‌నంతిట్ట జిల్లాలోని మ‌ల్ల‌ప‌ల్లిలో రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ అంత్య‌క్రియ‌ల‌కు కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఇత‌ర‌ అధికారులు, వంద‌లాది మంది ప్ర‌జ‌లు హాజ‌రై చిన్నారికి క‌డ‌సారి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.

మ‌ల్ల‌ప‌ల్లికి చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ దంప‌తులు త‌మ ప‌ది నెల‌ల చిన్నారి అలిన్ షెరిన్ అబ్ర‌హం, మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ఈనెల 5న కారులో ప్ర‌యాణిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఎదురుగా వ‌స్తున్న మ‌రోకారు వీరి వాహ‌నాన్ని బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులోని వారంతా స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ చిన్నారికి మాత్రం తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. బ‌తికే అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు చిన్నారి అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని నిర్ణ‌యించారు. వైద్యుల స‌హాక‌రంతో చిన్నారి నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, గుండె వాల్వ్‌, క‌ళ్లు సేక‌రించి అవ‌స‌ర‌మైన వారికి అందించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. పుట్టెడు దఃఖంలో కూడా మాన‌వ‌త్వం చాటుకున్నారంటూ ప‌లువురు కొనియాడారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం చిన్నారి అంత్య‌క్రియ‌ల‌ను అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించింది.

Advertisement
Advertisement