Monsoon session | పార్లమెంట్ ముందుకు వెళ్లే కీలక బిల్లులు ఇవే.. డీలిమిటేషన్‌కు దక్కని చోటు..!
Monsoon session | జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను లోక్‌సభ సచివాలయం విడుదల చేసింది. ఇందులో ఐదు కొత్త బిల్లులతో సహా ఏడు బిల్లులు తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ లిస్ట్‌లో వివాదాస్పదంగా మారిన డీలిమిటేషన్ బిల్లుకు చోటు కల్పించకపోవడం గమనార్హం.
Monsoon session | త్రినేత్ర.న్యూస్ : జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభలో (Lok Sabha) మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను లోక్‌సభ సచివాలయం విడుదల చేసింది. ఇందులో ఐదు కొత్త బిల్లులతో సహా ఏడు బిల్లులు తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ లిస్ట్‌లో వివాదాస్పదంగా మారిన డీలిమిటేషన్ బిల్లుకు చోటు కల్పించకపోవడం గమనార్హం.
లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన తాత్కాలిక ఎజెండా ప్రకారం.. ప్రభుత్వం 5 కొత్త బిల్లులతో పాటు రెండు పెండింగ్ బిల్లులను సభ ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కొత్తగా ప్రవేశ పెట్టబోయే బిల్లుల్లో ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు-2026, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు అత్యంత కీలకమైనవి. ఇవి రెండూ ప్రస్తుతం అమల్లో ఉన్న అత్యవసర ఆర్డినెన్స్‌ల స్థానంలో చట్టబద్ధత కోసం రానున్నాయి.
జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే (సవరణ) బిల్లు 2026ను కూడా సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వందేమాతరం, జనగణమన పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించేలా ఈ బిల్లును సవరణ చేశారు. దీంతోపాటూ జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026 కూడా సభ ముందుకు రానుంది. బర్త్, డెత్ రిజిస్ట్రేషన్లను ఆలస్యంగా నమోదు చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి సంబంధించిన కీలక సవరణ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానుంది.
వీటితోపాటూ రెండు పాత బిల్లులను కూడా సభ ముందుకు తీసుకురానుంది కేంద్ర సర్కార్. విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి గత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లు-2026ను మళ్లీ చర్చకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉభయ సభల జాయింట్ కమిటీ పరిశీలనలో ఉన్న విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025 పై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ రెండు బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఈ లిస్ట్‌లో గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill), మహిళల రిజర్వేషన్ బిల్లు, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో ప్రధాని, సీఎం అరెస్టై వరుసగా 30 రోజులకుపైగా జైలులో ఉంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దయ్యేలా బిల్లులకు చోటు దక్కలేదు. అయితే, వీటిని డైరెక్ట్‌గా సభలో ప్రవేశపెడతారా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ లేదు. సభ సాగే పరిస్థితిని, మెజారిటీని బట్టి వీటిని సభ ముందుకు తీసుకెళ్లాలని ఎన్డీయే సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. జూలై 19న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తన శాసనసభాపరమైన ఎజెండాను వివరించనుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తాము సభలో లేవనెత్తాలనుకుంటున్న అంశాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
The five new bills that the government is likely to take up during the Eighth Session of Eighteenth Lok Sabha:
1. The Income-tax (Amendment) Bill, 2026. (To replace an Ordinance)
2. The Supreme Court (Number of Judges) Amendment Bill, 2026 (To replace an Ordinance)
3. The… pic.twitter.com/8zfyTdGGXR— ANI (@ANI) July 17, 2026
Also Read..
పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి
పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Payal Mehta | సీఎన్ఎన్ – న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా కన్నుమూత
సెప్టెంబర్ 20, 2026

TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు నడిచిన సభ
సెప్టెంబర్ 18, 2026

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి
- ●IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి



