Mallikarjun Kharge | డీలిమిటేషన్ బిల్లుపై చర్చిద్దాం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
Mallikarjun Kharge | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.
Mallikarjun Kharge | జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) గురువారం లేఖ రాశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టే ముందు.. సవరించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సవరించిన ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు వాటిని అధ్యయనం చేసేందుకు విపక్ష పార్టీలకు తగిన సమయం ఇవ్వాలని తన లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపాదిత బిల్లులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పదేపదే లేఖలు రాసిన విషయాన్ని ఖర్గే లేఖలో ప్రస్తావించారు. అయితే, తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఏప్రిల్ 17న సభలో వీగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బిల్లును ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ సవరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోదీని ఖర్గే కోరారు.
Hon’ble Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun @Kharge ji has just written to the Prime Minister on the reportedly revised 131st Constitution Amendment Bill pic.twitter.com/TsR7weEvBW
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 16, 2026
Also Read..
ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్
హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం
సోనమ్ వాంగ్‌చుక్‌కు దీపికా పడుకోణ్ మద్దతు - సోషల్ మీడియాలో రచ్చ - అసలు ట్విస్ట్ ఇదే?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్
- ●Rains | హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం
- ●Deepika Padukone | సోనమ్ వాంగ్‌చుక్‌కు దీపికా పడుకోణ్ మద్దతు - సోషల్ మీడియాలో రచ్చ - అసలు ట్విస్ట్ ఇదే?
- ●CPP Meeting | పార్లమెంట్ వేదికగా ప్రజల గళం వినిపించనున్న కాంగ్రెస్
- ●CM Vijay | అలాంటివారికి రెండో ఛాన్స్ ఉండదు.. మంత్రులకు సీఎం విజయ్ కీలక హెచ్చరికలు
- ●Woman Reservations | చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మహిళా జేఏసీ విజ్ఞప్తి

Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్

Rains | హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం

Deepika Padukone | సోనమ్ వాంగ్‌చుక్‌కు దీపికా పడుకోణ్ మద్దతు - సోషల్ మీడియాలో రచ్చ - అసలు ట్విస్ట్ ఇదే?

CPP Meeting | పార్లమెంట్ వేదికగా ప్రజల గళం వినిపించనున్న కాంగ్రెస్





