త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamal Haasan | క‌మ‌ల్ హాస‌న్ ఎంఎన్ఎంకి బ్యాట‌రీ టార్చ్ గుర్తు కేటాయింపు

Kamal Haasan | ప్ర‌ముఖ‌ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) 'బ్యాట‌రీ టార్చ్' (Battery Torch) గుర్తును కేటాయించింది.

D

National | Published On Feb 17, 2026, 1.29 pm IST

Kamal Haasan | క‌మ‌ల్ హాస‌న్ ఎంఎన్ఎంకి బ్యాట‌రీ టార్చ్ గుర్తు కేటాయింపు
Advertisement

Kamal Haasan | ప్ర‌ముఖ‌ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) 'బ్యాట‌రీ టార్చ్' (Battery Torch) గుర్తును కేటాయించింది. పుదుచ్చేరి (Puducherry) అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ గుర్తు కేటాయించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఎన్నికల సంఘం మంగ‌ళ‌వారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పుద‌చ్చేరి ఎన్నిక‌ల్లో ఎంఎన్ఎం అభ్య‌ర్థులు ఈ గుర్తుపైనే పోటీ చేయ‌నున్నారు.

కాగా, త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా ఈసీ ఇటీవ‌లే టార్చ్ గుర్తునే ఎంఎన్ఎంకు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు పుదుచ్చేరి ఎన్నిక‌ల‌కు కూడా ఇదే గుర్తు కేటాయించారు. ఈ టార్చ్ గుర్తు ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 'టార్చ్' గుర్తు ప్రజలకు సులభంగా గుర్తుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, క‌మ‌ల్ హాస‌న్ 2018లో ఎంఎన్ఎం పార్టీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఈసీ ఎన్నిక‌ల గుర్తు కేటాయించ‌డంతో క‌మ‌ల్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నుంది.

https://x.com/ANI/status/2023625030051975549

Advertisement
Advertisement