త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepavali | దీపావ‌ళి వేళ 48 మందికి గాయాలు.. స‌రోజినీ దేవి కంటి ఆస్ప‌త్రిలో చికిత్స‌

Deepavali | రాష్ట్ర వ్యాప్తంగా దీపావ‌ళి పండుగ వేళ ప‌టాకులు కాల్చారు. అయితే ప‌టాకులు కాల్చే క్ర‌మంలో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చాలా మంది చిన్నారులు కంటి చూపును కోల్పోయారు. దీంతో హైద‌రాబాద్‌లోని స‌రోజినీ దేవి కంటి ఆస్ప‌త్రికి బాధితులు క్యూ క‌ట్టారు.

S

Hyderabad | Published On Nov 9, 2026, 2.53 pm IST

Deepavali | దీపావ‌ళి వేళ 48 మందికి గాయాలు.. స‌రోజినీ దేవి కంటి ఆస్ప‌త్రిలో చికిత్స‌
Advertisement

Deepavali | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా దీపావ‌ళి పండుగ వేళ ప‌టాకులు కాల్చారు. అయితే ప‌టాకులు కాల్చే క్ర‌మంలో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చాలా మంది చిన్నారులు కంటి చూపును కోల్పోయారు. దీంతో హైద‌రాబాద్‌లోని స‌రోజినీ దేవి కంటి ఆస్ప‌త్రికి బాధితులు క్యూ క‌ట్టారు.

నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైన బాధితుల వివరాలను ద‌వాఖాన‌ వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు 48 మంది గాయాలతో హాస్పిటల్‌కు వచ్చారు. వీరిలో 38 మంది అవుట్ పేషెంట్లు.. మరో 10 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఇన్‌పేషెంట్ల‌లో న‌లుగురు చిన్నారులు ఉన్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement