Cancer drug | క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 96.45 శాతం వరకు తగ్గిన మందుల ధరలు..!
Cancer drug | క్యాన్సర్ (Cancer) మహమ్మారితో పోరాడుతున్న రోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పలు రకాల ఔషధాల (Cancer drug) ధరలు భారీగా తగ్గాయి. 137 క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌లపై పరిమితి విధించడంతో సవరించిన 1,364 డ్రగ్ ఫార్ములేషన్ల కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
Cancer drug | త్రినేత్ర న్యూస్ : ప్రాణాంతక క్యాన్సర్ (Cancer) మహమ్మారితో పోరాడుతున్న రోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పలు రకాల ఔషధాల ధరలను (Cancer drug) తగ్గించింది. 137 క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌లపై పరిమితి విధించడంతో సవరించిన 1,364 డ్రగ్ ఫార్ములేషన్ల (anti-cancer drug formulations) కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
అక్టోబర్ 17న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగా ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ 137 యాంటీ-క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధర (MRP)పై ట్రేడ్ మార్జిన్‌లను పరిమితం చేసింది. నవంబర్ 8 నాటికి 85 ఫార్మాస్యూటికల్ కంపెనీలు 121 మందులకు సంబంధించిన 1,364 యాంటీ-క్యాన్సర్ ఫార్ములేషన్ల సవరించిన MRPలను ప్రభుత్వానికి నివేదించాయి. వీటిల్లో దాదాపు 679 బ్రాండ్లకు చెందిన మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గగా.. కొన్ని మందుల గరిష్ట రిటైల్ ధర (MRP) అత్యధికంగా 96.45 శాతం వరకు తగ్గడం విశేషం. ఈ నిర్ణయంతో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం కలగడమే కాకుండా.. వినియోగదారులు ఏటా సుమారు రూ. 3,540.38 కోట్ల మేర ఆదా కానుంది.
మందులను గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువ ధరకు విక్రయించినా, లేదా మరేదైనా ధరల వ్యత్యాసాలు ఉన్నా వినియోగదారులు నేరుగా 'ఫార్మా జన్ సమాధాన్' (Pharma Jan Samadhan) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని కేంద్రం తెలిపింది. సరఫరా గొలుసులో అధిక ట్రేడ్ మార్జిన్‌లను అరికట్టడం, రోగులకు చికిత్స ఖర్చులను తగ్గించడం, కీలకమైన ఆంకాలజీ మందుల లభ్యతను మెరుగుపరచడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్స సాధారణంగా చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రోగులపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.
Also Read..
స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
తాజావార్తలు
- ●Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స
- ●Errabelli Dayakar Rao | పాలకుర్తిని కరువు మండలంగా ఎందుకు ప్రకటించినవ్?
- ●Citi | నిఫ్టీ టార్గెట్ @ 28,000.. బుల్ ర్యాలీ ఖాయం అంటున్న సిటీ గ్రూప్..
- ●Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
- ●Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు
- ●ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా

Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స

Errabelli Dayakar Rao | పాలకుర్తిని కరువు మండలంగా ఎందుకు ప్రకటించినవ్?

Citi | నిఫ్టీ టార్గెట్ @ 28,000.. బుల్ ర్యాలీ ఖాయం అంటున్న సిటీ గ్రూప్..

Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు






