త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | క్యాన్స‌ర్ రోగుల‌కు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!

Ramachander Rao | షెడ్యూల్‌ చేయని అన్ని క్యాన్సర్‌( Cancer ) నిరోధక మందులపై ట్రేడ్‌ మార్జిన్‌లను ఎంఆర్‌పీపై 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం( NDA Govt ) నిర్ణ‌యించ‌డంతో.. క్యాన్స‌ర్ రోగుల‌కు( Cancer Patients ) ఏటా రూ. 2500 కోట్ల మేర ఆదా అవుతుంద‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు( Ramachander Rao ) పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Oct 11, 2026, 5.40 pm IST

Ramachander Rao | క్యాన్స‌ర్ రోగుల‌కు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!
Advertisement

Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : షెడ్యూల్‌ చేయని అన్ని క్యాన్సర్‌( Cancer ) నిరోధక మందులపై ట్రేడ్‌ మార్జిన్‌లను ఎంఆర్‌పీపై 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం( NDA Govt ) నిర్ణ‌యించ‌డంతో.. క్యాన్స‌ర్ రోగుల‌కు( Cancer Patients ) ఏటా రూ. 2500 కోట్ల మేర ఆదా అవుతుంద‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు( Ramachander Rao ) పేర్కొన్నారు. ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్వ‌హించిన 'గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్' (Global Grace Cancer Run) కార్య‌క్ర‌మానికి రామ‌చంద‌ర్ రావు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు, అందుబాటు ధరల్లో నాణ్యమైన చికిత్స అందించడం కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో కేంద్రం షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌లపై 30 శాతం పరిమితిని ఆమోదించింది. దీంతో మందుల ధరలు 70 శాతం వరకు తగ్గడ‌మే కాకుండా, క్యాన్సర్ రోగులకు ప్ర‌తి ఏడాది దాదాపు రూ. 2,500 కోట్ల ఆదా అవుతుంద‌ని రామ‌చంద‌ర్ రావు అన్నారు.

Advertisement
Advertisement