త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Dayakar Rao | పాల‌కుర్తిని క‌రువు మండ‌లంగా ఎందుకు ప్ర‌క‌టించిన‌వ్‌?

Errabelli Dayakar Rao | దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తే పాలకుర్తి (Palakurthi)ని కరువు మండలం(Drought-Affected Mandal)గా ఎందుకు ప్రకటించావని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు (Errabelli Dayakar Rao) సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Nov 9, 2026, 2.27 pm IST

Errabelli Dayakar Rao | పాల‌కుర్తిని క‌రువు మండ‌లంగా ఎందుకు ప్ర‌క‌టించిన‌వ్‌?
Advertisement
  • ఇక్క‌డ‌ దేవాదుల నీళ్లు పారుతున్న‌య్‌
  • గ‌డ్డాల గురించెందుకు? ముందు రాష్ట్రాన్ని బాగు చెయ్‌
  • నీ బ్రోకర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయిర్రు.. ఇంకా మోసపోరు
  • తెలంగాణ అప్పుడెట్లుండే.. ఇప్పుడెంట్లుందో సూస్కో
  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటైర్స్‌

Errabelli Dayakar Rao త్రినేత్ర న్యూస్: దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తే పాలకుర్తి (Palakurthi)ని కరువు మండలం(Drought-Affected Mandal)గా ఎందుకు ప్రకటించావని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు (Errabelli Dayakar Rao) సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. గ‌డ్డాల గురించి మాట్లాడ‌డం ఆపి ముందు రాష్ట్రాన్ని బాగు చేయాల‌ని హిత‌వు ప‌లికారు. ఇక నీ మాట‌లు నమ్మి మోస‌పోయే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్నారు. అన్ని మండ‌లాల‌ను ప్ర‌క‌టించి ఆర్థిక సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాల‌నపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

పది ఏండ్ల ప్రభుత్వం లోపల కేసీఆర్ హయాంలో ఏం చేయలేదని రేవంత్ రెడ్డి అంటున్నడు. నేను మూడు ఏండ్లలో అన్ని చేశాను అంటున్నడు. పది ఏండల్లో తెలంగాణ ఎట్ల ఉండే.. ఇప్పుడు మూడు ఏండల్లో తెలంగాణ ఎట్ల ఉన్నది ఒక్కసారి చూస్కో. మేం అప్పుడు టీడీపీలో ఉన్నాం. ఆనాడు కాలిపోయిన మోటర్లు అసెంబ్లీ ముందు తెచ్చి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ధర్నాలో కూసున్నరు.

ఎస్సార్‌ఎస్పీ కాలువ పూర్త‌యిన తర్వాత ఐదారు జిల్లాలోకి నీళ్ళు రావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది.. కానీ చుక్క నీళ్లు రాలేదు. అప్పుడు మేం పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం. బాబ్లీ ప్రాజెక్టు కోసం ధర్నాలు చేస్తే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు. మేం చివరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాం.

ఇప్పుడు కూడా 2 టీఎంసీల నీరుంది

నాడు కేసీఆర్ హయాంలో ఎక్కడ కూడా కరువు మండలాలు లేవు. అప్పుడు వరద నష్టం ఉండే. ఇప్పుడు కరవు నష్టం అంటున్నారు. దేవాదుల ప్రాజెక్టు వద్ద నీటిని ఎత్తిపోసి నీళ్లు ఇచ్చాం. ఆరోజు రాత్రి మేడిగడ్డ దగ్గర బాంబు పేలింది అని అక్కడ రైతులు అంటున్నారు. ఏదో కుట్ర జరిగింద‌ని అంటున్నారు. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు కూడా రెండు టీఎంసీల నీరు ఉన్నది. రాష్ట్రంలో కరువు తెచ్చింది నువ్వు.. కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు, దేశాలు చేతులెత్తేశాయి. కానీ కేసీఆర్ అధైర్యపడకుండా ధైర్యం చెప్పారు. ప్రతి ఒకరిని కాపాడుకుంటాను అని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేద‌ని చేతులు ఎత్తేశాడు.

పోదాంరా.. ప్ర‌జ‌ల‌ను అడుగుదాం

చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పిండు కరువు వచ్చినా తెలంగాణకు ఇబ్బంది లేదని. తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయి అన్నారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మిషన్ భగీరథ పథకం ఇక్కడ అమలు చేసిన తర్వాత ఆ పథకం కేంద్రం అమలు చేసింది. అప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇక్కడ కాదు మాట్లాడాల్సింది.. ఊర్లోకి వెళ్ళి పొలీస్ లు లేకుండా రా పోదాం.. ప్రజలను అడుగుదాం.

పెన్షన్ లు ఎక్కడ పోయినయ్‌? మహిళలకు ఫ్రీ బస్ అన్నావ్ మగవారికి డబుల్ ఛార్జీలు చేశావు. నేను రాజకీయంగా ఎప్పటి నుండో ఉన్నా. మా నాన్న రాజకీయ నాయకుడు. నువ్‌ ప్రింటింగ్ ప్రెస్ నడిపించేవాడివి. గోడల మీద రాసేవాడివి. అది కూడా రెంట్ కట్టకపోతే ఓనర్ నోటీస్ ఇచ్చాడు. మా నాయకులను అనడం ఏంటి? నేను 7 సార్లు గెలిచాను. నువ్ గడుపు వస్తే గెలుస్తవ్‌.. నీ గురించి అంతా తెల్సు.

డబ్బు అంతా కొడంగల్‌లో పెడుతున్నవ్. అక్కడ కూడా నిన్ను చీకొడుతున్నారు. నేను రైతు కుటుంబంలో పుట్టాను. వరంగల్ జిల్లా ప్రజలు నన్ను ఆదరిస్తారు. నువ్‌ బద్మాశ్‌వీ. దొంగ సర్టిఫికెట్ లు దొంగ పనులే నీయి. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు మూడు నెలల్లో చేసి చూపెడుతామ‌ని హరీష్ రావు అంటే.. ఎందుకు అప్పజెప్పడం లేదు? ఇప్పటికైన రాష్ట్రాన్ని బాగు చెయ్‌. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. విత్తనాలు కొంటే డిక్లరేషన్ ఇవ్వాలంట. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు గ‌డ్డం పెంచుతారు.. తీసేస్తారు. నేను కూడా ముప్పై ఏండ్లు పెంచాను. మొన్న ఆరు ఏండ్లు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాను అని ద‌యాక‌ర్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement