Citi | నిఫ్టీ టార్గెట్ @ 28,000.. బుల్ ర్యాలీ ఖాయం అంటున్న సిటీ గ్రూప్..
Citi | భారత స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ సిటీ గ్రూప్ బుల్లిష్ అంచనాలను ప్రకటించింది. నిఫ్టీ 50 లక్ష్యాన్ని గతంలో ప్రకటించిన 26,000 నుంచి 28,000కు పెంచింది. ప్రస్తుత స్థాయిల నుంచి మరో 12 శాతం వరకు లాభపడే అవకాశం ఉందని అంచనా వేసింది. మెరుగైన కంపెనీల ఆర్థిక ఫలితాలు, తగ్గుతున్న ముడి చమురు ధరలు, కృత్రిమ మేధ పెట్టుబడుల్లో మార్పులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
Citi | భారత స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ సిటీ గ్రూప్ బుల్లిష్ అంచనాలను ప్రకటించింది. నిఫ్టీ 50 లక్ష్యాన్ని గతంలో ప్రకటించిన 26,000 నుంచి 28,000కు పెంచింది. ప్రస్తుత స్థాయిల నుంచి మరో 12 శాతం వరకు లాభపడే అవకాశం ఉందని అంచనా వేసింది. మెరుగైన కంపెనీల ఆర్థిక ఫలితాలు, తగ్గుతున్న ముడి చమురు ధరలు, కృత్రిమ మేధ పెట్టుబడుల్లో మార్పులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
నిఫ్టీ 28000కు చేరుతుందా..?
భారత ఈక్విటీ మార్కెట్లపై అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ సిటీ గ్రూప్ ఆశావహ అంచనాలను వెల్లడించింది. సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో నిఫ్టీ 50 లక్ష్యాన్ని 26,000 నుంచి 28,000కు పెంచింది. ఈ కొత్త లక్ష్యం ప్రస్తుత మార్కెట్ స్థాయిలతో పోలిస్తే సుమారు 12 శాతం వృద్ధికి అవకాశం ఉందని సూచిస్తోంది. గత వారం నిఫ్టీ 50 ఏకంగా 7.5 శాతం లాభపడింది. దాదాపు ఆరేళ్లలో అత్యుత్తమ వారాంతపు పనితీరును నమోదు చేసింది. రెండో త్రైమాసిక కంపెనీల ఆర్థిక ఫలితాలు మొదటి త్రైమాసికంలో నమోదైన సానుకూల ధోరణిని కొనసాగించాయని సిటీ అభిప్రాయపడింది. వస్తువుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ కంపెనీల ఆదాయ వృద్ధి మెరుగ్గా ఉందని, 2026-2028 ఆర్థిక సంవత్సరాల మధ్య భారత కంపెనీల ఆదాయాలు ఏటా సగటున 15-16 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
4 కారణాలను వెల్లడించిన సిటీ గ్రూప్..
సిటీ తన బుల్లిష్ అంచనాలకు నాలుగు ప్రధాన కారణాలను వెల్లడించింది. మొదటిది, కంపెనీల మెరుగైన క్యూ2 ఫలితాలు, ఆదాయ వృద్ధిపై సానుకూల అంచనాలు. రెండోది, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం. చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు తగ్గితే భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 30-40 బేసిస్ పాయింట్లు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం 50 బేసిస్ పాయింట్ల మేర దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నిఫ్టీ కంపెనీల షేర్ల వారీ ఆదాయాలు (ఈపీఎస్) సుమారు 2 శాతం పెరిగే అవకాశం ఉందని వివరించింది. మూడోది, అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం డేటా సెంటర్లపై పరిమితులు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు ఇతర ఆస్తుల వైపు మళ్లుతున్నాయని, ఈ పరిణామం భారత మార్కెట్లకు ప్రయోజనం చేకూర్చుతుందని తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెట్టుబడుల వృద్ధి మందగిస్తే టోకెన్ల లభ్యత, ధరలు, ఏఐ విస్తరణ వేగంపై ప్రభావం పడుతుందని, అయితే ఏఐ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, ఫలితాలు సాధించడంపై దృష్టి పెరగడం భారత కంపెనీలకు అనుకూలమని పేర్కొంది.
మరో 12 బిలియన్ డాలర్లు వచ్చే చాన్స్..
నాలుగోది, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీ ఆధారంగా పెట్టుబడులు పెట్టిన ఆస్తుల విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, యాక్టివ్ వెయిటేజీలో దాదాపు 20 శాతం పెరుగుదల వస్తే భారత్‌కు సుమారు 12 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎంఎస్‌సీఐ సూచీలో భారత వెయిటేజీ, ఎమర్జింగ్ మార్కెట్ పోర్ట్‌ఫోలియోల్లో భారత్‌కు కేటాయించిన పెట్టుబడుల వాటా రెండూ బహుళ సంవత్సరాల కనిష్ఠ స్థాయిలకు సమీపంలో ఉన్నాయని, దేశీయ పెట్టుబడుల ప్రవాహం మాత్రం స్థిరంగా కొనసాగుతోందని వివరించింది. అయితే భారత మార్కెట్లకు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని సిటీ హెచ్చరించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం సమీపకాలంలో మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. జీఎస్టీ ప్రయోజనాల ప్రభావం తగ్గడం, ఎల్‌నినో కారణంగా వినియోగ డిమాండ్ మందగించే అవకాశం, ఉద్యోగాలపై కృత్రిమ మేధ ప్రభావం అంచనాలకు మించి ఉండడం వంటి అంశాలను కూడా ప్రధాన రిస్కులుగా పేర్కొంది.
బజాజ్ ఫైనాన్స్ టాప్ స్టాక్‌గా ఎంపిక..
ఇక తన భారత టాప్ పిక్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్‌ను చేర్చింది. కంపెనీ వృద్ధి అవకాశాలు, విభిన్న ఆర్థిక ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన ప్రొవిజనింగ్ బఫర్ కారణంగా ఆదాయాల్లో స్థిరత్వం, మెరుగైన రాబడులు సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ముడి చమురు ధరలు తగ్గిన స్థాయిలో కొనసాగితే కన్జ్యూమర్ స్టేపుల్స్ రంగానికి స్వల్పకాలిక ప్రయోజనం కలుగుతుందని, అయితే పోటీ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. డేటా సెంటర్ల పరిణామాల వల్ల కొన్ని పారిశ్రామిక షేర్లపై ఒత్తిడి ఉంటుందని, విద్యుత్ పెట్టుబడులు, తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ఇతర వృద్ధి చోదకాలున్న కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సిటీ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
నవంబర్ 9, 2026

Muhurat Trading | దీపావళి నాడు ప్రత్యేక స్టాక్ మార్కెట్ సెషన్.. ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?
నవంబర్ 7, 2026

Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?
నవంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
- ●Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు
- ●ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా
- ●Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ●Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?
- ●KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్

Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు

Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు

ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా

Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి



