Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు
Sanath nagar Police | అక్రమంగా డబ్బు సంపాదించాలని ఓ ఇద్దరు పోలీసులు ఓ సామాన్యుడిని బెదిరించారు. అతని బైక్‌ను కూడా సీజ్ చేశారు. బైక్ ఇవ్వాలంటే రూ. 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధిత వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోవడంతో సదరు పోలీసులపై కేసు నమోదైంది.
Sanath nagar Police | త్రినేత్ర న్యూస్ : అక్రమంగా డబ్బు సంపాదించాలని ఓ ఇద్దరు పోలీసులు ఓ సామాన్యుడిని బెదిరించారు. అతని బైక్‌ను కూడా సీజ్ చేశారు. బైక్ ఇవ్వాలంటే రూ. 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధిత వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోవడంతో సదరు పోలీసులపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. సనత్ నగర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డు కలిసి ఆదివారంం సాయంత్రం ఓ వ్యక్తితో గొడవకు దిగారు. అంతేకాదు.. అతన్ని బైక్‌ను లాక్కొని, స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధిత వ్యక్తి తన బైక్ తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. కానీ పోలీసులు డబ్బు డిమాండ్ చేశారు. రూ. 2 వేలు ఇవ్వాలని అడిగారు. చేసేదేమీ లేక బాధితుడు రూ. 1000 పోలీసుల చేతిలో పెట్టి.. తన బైక్‌ను తెచ్చుకున్నాడు.
తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అక్రమంగా తన బైక్‌ను లాక్కొని, తిరిగి తనతో రూ. 1000 తీసుకుని బైక్ ఇచ్చారని వాపోయాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేశారు. బాధితుడి నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని సోమవారం ఉదయం సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
- ●Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
- ●ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా
- ●Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ●Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?
- ●KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్
- ●DK Shivakumar | షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు

Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు

ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా

Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?





