IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు
IBPS SO Recruitment | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు జూలై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IBPS SO Recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు జూలై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 745 పోస్టులను (IBPS SO Recruitment) భర్తీ చేస్తున్నది. ఇందులో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. రిక్రూట్ మెంట్ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ఎంపికైన వారికి ప్రతినెల రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం అందుతుంది.
మొత్తం ఖాళీలు- 745
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 190 పోస్టులు
అర్హతలు: అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, కో-ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో-ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్ ఇంజినీరింగ్‌లో నాలుగు సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఐటీ ఆఫీసర్: 301 పోస్టులు
అర్హతలు: ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్/ టెక్నాలజీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదంటే పీజీ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్)లో పాసై ఉండాలి.
లా ఆఫీసర్: 105 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేయాలి. బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా ఎన్రోల్ చేసుకుని ఉండటం తప్పనిసరి.
హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్: 60 పోస్టులు
అర్హతలు: డిగ్రీతో పాటు హెచ్‌ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్, లేబర్ లా, సోషల్ వర్క్ తదితరాల్లో రెండేండ్ల పూర్తి పీజీ, డిప్లొమా చేయాలి.
రాజ్‌భాష అధికారి: 89 పోస్టులు
అర్హతలు: హిందీలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ చదివి ఉండాలి. లేదా సంస్కృతంలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్‌లో హిందీ, ఇంగ్లిష్ చదివిన వారు అర్హులు.
వయోపరిమితి: 2026, జూలై 1 నాటికి పై అన్ని పోస్టులకు 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. 1996, జూలై 2 నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష.. ఆ రెండిటిలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: మొత్తం 125 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్(25 ప్రశ్నలు, 25 మార్కులు), రీజనింగ్(25 ప్రశ్నలు, 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు, 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్(25 ప్రశ్నలు, 50 మార్కులు) కలిపి మొత్తం 125 మార్కులకు ఉంటుంది. సమయం 80 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మెయిన్ ఎగ్జామ్: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు 225 మార్కులకు పరీక్ష ఉంటుంది. అయితే ప్రశ్నలు వచ్చే విభాగాలు మారతాయి. ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్క్ కోత ఉంటుంది.
రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరి తేది: జూలై 21
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు నెలలో
ఫలితాలు: సెప్టెంబర్ లేదా అక్టోబర్
మెయిన్ పరీక్ష తేదీ, ఫలితాలు: నవంబర్
ఇంటర్వ్యూ: నవంబర్/డిసెంబర్ 2026
ఫైనల్ ఫలితాల ప్రకటన: జనవరి 2027
వెబ్సైట్: www.ibps.in
తాజావార్తలు
- ●Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
- ●Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..
- ●ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!
- ●Dhatura | ఆన్‌లైన్‌లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
- ●Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు

Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..

ఓటీటీలు, డిజిటల్ యాప్‌ల సబ్స్క్రిప్షన్లు వాడుతున్నారా?.. మన దృష్టికి రాకుండానే కరుగుతున్న జీతం!






