Terrorists | పాక్ ఉగ్రవాదులతో లింక్..! మేడ్చల్‌లో యువకుడు అరెస్ట్..!!
Terrorists | హోటల్ వెయిటర్ ముసుగులో నిరంతరం పాకిస్తాన్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉంటూ మన దేశంలోని కొంతమంది ప్రముఖుల వివరాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ఛాన్స్ ఇస్తే నేను పాక్‌కు వస్తాను..!
ఆన్‌లైన్‌లో ఓ యువకుడు చాటింగ్..!
Terrorists | త్రినేత్ర.న్యూస్ : హోటల్ వెయిటర్ ముసుగులో నిరంతరం పాకిస్తాన్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉంటూ మన దేశంలోని కొంతమంది ప్రముఖుల వివరాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాహేద్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మేడ్చల్‌కు వలసొచ్చాడు. స్థానికంగా ఉన్న ముబారక్ హోటల్‌లో వెయిటర్‌గా చేరాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా జాహేద్ తన ఇన్‌స్టా గ్రాం ఖాతా ద్వారా.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సంభాషిస్తున్నాడు. పాక్ వస్తానని, ఉగ్రవాద శిక్షణలో పాల్గొంటానని వారిని కోరాడు. దీంతో జాహేద్‌కు ఉగ్రవాదులు కొన్ని పరీక్షలు కూడా పెట్టారు. అంతేకాదు కొంతమంది వీఐపీల సమాచారం కావాలని ఉగ్రవాదులు అడగడంతో.. వారికి షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిరంతరం జాహేద్ ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోలు చూడడం, తుపాకులతో ఫొటోలు దిగడం.. వాటిని సోసల్ మీడియాలో షేర్ చేస్తూ ఉగ్రవాదానికి ఆకర్షితులైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అతన్నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు రెండు బొమ్మ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తానికి ఈ కేసులో ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. జాహేద్ వ్యక్తిగత అంశాలపై లోతుగా విచారిస్తున్నారు. అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారంతో పాటు డిలీట్ చేసిన సమాచారం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ ఉగ్రవాదితో జాహేద్ మాట్లాడిన అంశంపై ఆరా తీయగా, అతను టెర్రర్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. జాహేద్‌ను మేడ్చల్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Bus overturns | డబుల్ డెక్కర్ బస్సు బోల్తా.. ఆరుగురు ప్రయాణికులు మృతి
మే 26, 2026

Jagadeesh Reddy | యూపీలో మీటర్లు వద్దన్నది మీరే.. మరి తెలంగాణలో ఎట్ల పెడుతరు?: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
మే 24, 2026

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



