MakeMyTrip IPO | మేక్‌మైట్రిప్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. త్వరలో మార్కెట్‌లోకి..
MakeMyTrip IPO | ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థ మేక్‌మైట్రిప్ భారత అనుబంధ సంస్థ ఎంఎంటీ ఇండియా ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. జూలైలో రహస్య పద్ధతిలో ముసాయిదా పత్రాలను సమర్పించిన సంస్థకు సెబీ తుది పరిశీలన అనుమతులు జారీ చేసింది. ఈ ఐపీఓ ద్వారా మేక్‌మైట్రిప్, ఇబిబో గ్రూప్ హోల్డింగ్స్ తమ వాటాలను విక్రయించనున్నాయి.
MakeMyTrip IPO | ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థ మేక్‌మైట్రిప్ భారత అనుబంధ సంస్థ ఎంఎంటీ ఇండియా ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. జూలైలో రహస్య పద్ధతిలో ముసాయిదా పత్రాలను సమర్పించిన సంస్థకు సెబీ తుది పరిశీలన అనుమతులు జారీ చేసింది. ఈ ఐపీఓ ద్వారా మేక్‌మైట్రిప్, ఇబిబో గ్రూప్ హోల్డింగ్స్ తమ వాటాలను విక్రయించనున్నాయి.
సెబీ తుది పరిశీలన అనుమతులు జారీ..
నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థ మేక్‌మైట్రిప్ భారత అనుబంధ సంస్థ మేక్‌మైట్రిప్ (ఇండియా) లిమిటెడ్ (ఎంఎంటీ ఇండియా) త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. సోమవారం సెబీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఎంఎంటీ ఇండియా రహస్య పద్ధతిలో ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించింది. వాటిని పరిశీలించిన అనంతరం సెబీ తుది పరిశీలన అనుమతులు జారీ చేసింది. దీంతో అవసరమైన నియంత్రణ నిబంధనలను పాటిస్తూ ఐపీఓకు సంబంధించిన తదుపరి ఏర్పాట్లు చేసుకునేందుకు కంపెనీకి మార్గం సుగమమైంది.
అనుబంధ సంస్థలోని షేర్ల విక్రయం..
ఈ ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా మేక్‌మైట్రిప్ తన భారత అనుబంధ సంస్థలోని ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. అలాగే సంస్థకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉన్న సింగపూర్‌కు చెందిన ఇబిబో గ్రూప్ హోల్డింగ్స్ కూడా తన వాటాలను విక్రయించనుంది. అయితే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తయిన తర్వాత కూడా ఎంఎంటీ ఇండియా మేక్‌మైట్రిప్ అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది. దాని ఆర్థిక ఫలితాలను మాతృసంస్థ ఆర్థిక ఫలితాల్లో కలిపి చూపించనున్నారు.
ఈ ఐపీఓ, స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ ద్వారా ఎంఎంటీ ఇండియా బ్రాండ్ గుర్తింపు మరింత పెరుగుతుందని మేక్‌మైట్రిప్ వెల్లడించింది. అలాగే పోటీతో కూడిన టెక్నాలజీ రంగంలో ప్రతిభావంతులను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ లిస్టింగ్ దోహదపడుతుందని పేర్కొంది. షేర్ల విక్రయం ద్వారా మేక్‌మైట్రిప్, ఇబిబో గ్రూప్ హోల్డింగ్స్‌కు లభించే నికర ఆదాయాన్ని మాతృసంస్థ నగదు నిల్వలను బలోపేతం చేసేందుకు వినియోగించనున్నారు. దీర్ఘకాలిక వృద్ధి, వ్యూహాత్మక వ్యాపార విస్తరణ, కన్వర్టబుల్ సెక్యూరిటీలతో సహా వివిధ రకాల సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం వంటి అవసరాలకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి
- ●Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు
- ●Lifestyle Inflation | వేతనం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?
- ●Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!
- ●Cancer drug | క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 96.45 శాతం వరకు తగ్గిన మందుల ధరలు..!
- ●Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స

Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి

Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు

Lifestyle Inflation | వేతనం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?

Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!






